Rithika Naik : టాలీవుడ్‌లో కొంతమంది హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలను అందుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి హీరోయిన్ల జాబితాలో ఇప్పుడు రితిక నాయక్ (Rithika Naik) పేరు వినిపిస్తోంది.
తక్కువ సినిమాలకే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాను నటించిన చిత్రాలు విజయవంతం కావడంతో టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా మారుతోంది.
మిరాయ్ సినిమాలో రితిక :
రితిక నాయక్ హీరోయిన్‌గా పరిచయమైన చిత్రం విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమాలో ఆమె తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన రితికకు ఆ తర్వాత నాని నటించిన హాయ్ నాన్న చిత్రంలో కనిపించే అవకాశం వచ్చింది. సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆ తర్వాత తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన మిరాయ్ సినిమాలో రితిక నాయక్ ఫిమేల్ లీడ్‌గా నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి స్పందన రావడంతో పాటు నటన పరంగానూ మరో మెట్టు ఎక్కింది. దీంతో టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు మరింత పెరిగాయి.తాజాగా వరుణ్ తేజ్‌తో కలిసి నటించిన కొరియన్ కనకరాజ్ కూడా విజయాన్ని అందుకోవడంతో రితిక ఖాతాలో మరో సక్సెస్ చేరింది. దీంతో ఆమె నటించిన సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
హీరోయిన్‌గా ఎంచుకుంటున్న కథలు, పాత్రలు కూడా రితిక కెరీర్‌కు కలిసొస్తున్నాయని అభిమానులు అంటున్నారు. ఇప్పటివరకు చేసిన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇదే జోరును కొనసాగిస్తే టాలీవుడ్‌లో మరింత బిజీ హీరోయిన్‌గా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస విజయాలతో రితిక నాయక్ నిజంగానే టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా మారుతుందా అనేది రాబోయే సినిమాలతో తేలనుంది.

