Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాప్-2 కోసం హైదరాబాద్‌కు హోరాహోరీ పోరు!

టాప్-2 కోసం హైదరాబాద్‌కు హోరాహోరీ పోరు!

వార్త 2 days ago

SRH vs RCB Today Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026)లో భాగంగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఒక హై-వోల్టేజ్ పోరు జరగనుంది.

ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు మరికొన్ని గంటల్లో మైదానంలో తలపడనున్నాయి. రెండు జట్లూ ఇప్పటికే నాకౌట్ చేరినప్పటికీ, లీగ్ టేబుల్‌లో అగ్రస్థానాల సమీకరణాల దృష్ట్యా ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.

Read Also :SRH Vs RCB Match: మ్యాచ్‌పై రూ. 20 కోట్ల బెట్టింగ్ అంచనా!

ప్రస్తుత పాయింట్ల పట్టిక స్థానాలు (Points Table Positions)

గురువారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో పాయింట్ల పట్టిక ఆసక్తికరంగా మారింది:

  1. ఆర్సీబీ (RCB): 18 పాయింట్లతో మెరుగైన నెట్ రన్ రేట్ (NRR) కలిగి ఉండి ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ఉంది.
  2. గుజరాత్ టైటాన్స్ (GT): 18 పాయింట్లతో ఉన్నప్పటికీ, ఆర్సీబీ కంటే తక్కువ రన్ రేట్ ఉండటంతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
  3. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
  4. రాజస్తాన్ రాయల్స్ (RR): 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

హైదరాబాద్‌కు ‘టాప్-2’ గండం.. ఎందుకంత ముఖ్యం?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో కేవలం గెలిస్తే సరిపోదు, పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానానికి చేరాలంటే రన్ రేట్‌ను భారీగా మెరుగుపరుచుకోవాలి. ఆర్సీబీపై కనీసం 100 పరుగుల తేడాతో లేదా భారీ ఓవర్ల తేడాతో నెగ్గితేనే ఎస్‌ఆర్‌హెచ్ రెండో స్థానానికి చేరే అవకాశం ఉంటుంది.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం లీగ్ దశలో టాప్-2లో నిలిచిన జట్లకు ఫైనల్స్ చేరేందుకు రెండు అవకాశాలు (క్వాలిఫయర్ 1 మరియు క్వాలిఫయర్ 2) ఉంటాయి. ఒకవేళ క్వాలిఫయర్ 1లో ఓడినా.. ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్ 2 ఆడి ఫైనల్ చేరవచ్చు. 3 లేదా 4వ స్థానాల్లో నిలిచే జట్లు నేరుగా ‘ఎలిమినేటర్’ ఆడాల్సి ఉంటుంది, అక్కడ ఓడితే టోర్నీ నుండి నిష్క్రమిస్తారు. అందుకే ఈ మ్యాచ్ హైదరాబాద్‌కు అత్యంత కీలకం.

 Sunrisers vs RCB IPL 2026

‘హెడ్-అభిషేక్’ జోడీపైనే భారం.. 2024 నాటి రికార్డు రిపీట్ అవుతుందా?

ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అత్యంత బలంగా ఉంది. వారిని అడ్డుకోవాలంటే ఎస్‌ఆర్‌హెచ్ మిడిలార్డర్ బ్యాటర్లు క్లాసెన్, ఇషాన్ కిషన్ల కంటే కూడా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల పాత్రే కీలకం కానుంది. ఉప్పల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టి, ఈ ధ్వయం కనుక మొదటి 10 ఓవర్లు క్రీజులో నిలబడితే స్కోరు బోర్డు రాకెట్‌లా దూసుకెళ్లడం ఖాయం.

ఆనాటి చారిత్రాత్మక రికార్డు:

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు (287 పరుగులు) చేసిన జట్టుగా సన్‌రైజర్స్ రికార్డు సృష్టించింది. ఆ మ్యాచ్ జరిగింది కూడా ఆర్సీబీ పైనే కావడం విశేషం. ఆ రోజు ట్రావిస్ హెడ్ కేవలం 41 బంతుల్లోనే 102 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.

గత రెండు మ్యాచ్‌ల్లో హెడ్ ఆశించిన స్థాయిలో రాణించనప్పటికీ, ఈ హోమ్ గ్రౌండ్ మ్యాచ్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు అభిషేక్ శర్మ కూడా తన బ్యాట్‌కు పని చెప్పాల్సి ఉంది.

SRH vs RCB Today Match: సన్నాహక పోరు.. 2016 సెంటిమెంట్!

ప్లే ఆఫ్స్‌కు ముందు జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ కావడంతో, ఇరు జట్లూ దీన్ని నాకౌట్ దశకు ఒక రిహార్సల్‌గా భావిస్తున్నాయి. అన్నీ వర్కౌట్ అయితే హైదరాబాద్ టాప్-2 కి చేరుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్ స్థానానికి వచ్చే ఢోకా లేదు. ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చినా కంగారు పడాల్సిన పని లేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు; ఎందుకంటే 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ కప్పు కొట్టింది కూడా ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు ఆడే అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

CSKకు భారీ షాక్.. స్లో ఓవర్ రేట్‌తో జట్టుకు జరిమానా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha