MI vs PBKS: ఐపీఎల్ 2026లో ఒక సంచలన మార్పు చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన బుమ్రా.. పిచ్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బౌలింగ్ ఎంచుకున్నారు.
Read Also:CSK Squad Changes 2026: CSK లోకి సౌతాఫ్రికా యంగ్ స్టార్
MI vs PBKS: కెప్టెన్‌గా బుమ్రా అరంగేట్రం
ముంబై ఇండియన్స్ చరిత్రలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాలు జట్టును నడిపించారు. కానీ, జట్టు ప్రధాన బౌలర్ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కడం ఇదే తొలిసారి. గతంలో టీమిండియా తరపున 3 టెస్టులకు నాయకత్వం వహించిన అనుభవం బుమ్రాకు ఉంది (1 విజయం, 2 ఓటములు). ఈ సీజన్‌లో బుమ్రా తన ఫామ్ కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో, కెప్టెన్సీ అతని ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ముంబైకి ముగ్గురు స్టార్ల దూరం.. భారీ దెబ్బ!
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రమే కాదు, స్టార్ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ కూడా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు.
MI vs PBKS Live, Jasprit Bumrah Captain
రోహిత్, తిలక్ వర్మలకు దక్కని ఛాన్స్
రెగ్యులర్ కెప్టెన్లు అందుబాటులో లేని సమయంలో సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ లేదా యువ ఆటగాడు తిలక్ వర్మకు కెప్టెన్సీ ఇస్తారని భావించినప్పటికీ, మేనేజ్‌మెంట్ బుమ్రా వైపే మొగ్గు చూపింది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం బుమ్రా పేరును ఖరారు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
రెండు మార్పులతో బరిలోకి ముంబై
స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడంతో ముంబై జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా నాయకత్వంలో ముంబై ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

