Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాటా ఏరిస్.. అదిరిపోయే ఫీచర్లతో కొత్త సెడాన్ లాంచ్!

టాటా ఏరిస్.. అదిరిపోయే ఫీచర్లతో కొత్త సెడాన్ లాంచ్!

వార్త 1 week ago

Tata Aeris Sedan: సెడాన్ సెగ్మెంట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా టాటా మోటార్స్ కొత్త 'టాటా ఏరిస్' (Tata Aeris) మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

రూ. 5.29 లక్షలు (ఇంట్రడక్టరీ, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదలైన ఈ కారుకు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా, అక్టోబర్ 11 నుంచి డెలివరీలు మొదలుకానున్నాయి. టిగోర్‌తో పోలిస్తే అనేక మార్పులు చేసిన ఈ కారు ముందు భాగం టియాగో స్ఫూర్తితో, సైడ్ ప్రొఫైల్‌లో స్మూత్ కర్వ్స్‌తో సొగసుగా కనిపిస్తుంది. వెనుక భాగంలో కొత్త టెయిల్ ల్యాంప్స్, వాటిని అనుసంధానించే లైట్ స్ట్రిప్, మధ్యలో టాటా లోగో మరియు టెయిల్‌గేట్‌పై ప్రముఖంగా ‘Aeris’ లెటరింగ్‌ను అందించారు. ఈ కారు Dandeli Drizzle, Nitro Crimson, Dune Glow సహా 6 విభిన్న కలర్ ఆప్షన్లలో, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది.

Read Also : UPI Transaction Charges: రూ.2 వేలు దాటిన UPI పేమెంట్లపై ఛార్జీ.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్

 Tata Aries… New sedan launched with amazing features!

Tata Aeris Sedan: ప్రీమియం ఇంటీరియర్.. అత్యాధునిక టెక్నాలజీ

టాటా ఏరిస్ ఇంటీరియర్ కేబిన్ అత్యంత ప్రీమియంగా డిజైన్ చేయబడింది. కారు లోపల ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన 3-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఫ్రీ-ఫ్లోటింగ్ 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను అమర్చారు. దీని కింద ప్రాథమిక నియంత్రణల కోసం రోటరీ నాబ్‌లు, బటన్లు ఇచ్చారు. లెదరెట్ సీట్లు, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, Android Auto, Apple CarPlay, వెంటిలేటెడ్ సీట్లు మరియు డ్యూయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లు వంటి ఆధునిక ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తాయి.

తిరుగులేని భద్రత.. గట్టి పోటీ

భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే టాటా మోటార్స్ ఈ ఏరిస్ సెడాన్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, హై-బీమ్ అలర్ట్, ESP, TPMS, హిల్ హోల్డ్ కంట్రోల్, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, రోల్‌ఓవర్ మిటిగేషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లను జోడించింది. అంతేకాకుండా 360-డిగ్రీ కెమెరా సెటప్, ఇన్‌బిల్ట్ డ్యాష్‌క్యామ్ రికార్డర్‌ను కూడా అందించడం విశేషం. మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన ఆదరణ ఉన్న మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా వంటి మోడళ్లకు టాటా ఏరిస్ గట్టి పోటీనివ్వనుంది.

కేంద్రం గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనెల ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha