పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్
TG paddy procurement: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని సత్వరమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. అకాల వర్షాలకు తడిసిన 9,214 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. అకాల వర్షాలు సంభవించిన నేపథ్యంలో బుధవారం డిప్యూటి సిఎం భట్టి విమ్రార్కతో కలిసి కలెక్టర్లు, పోలీసు అధికారులు, రవాణాశాఖా ఉన్నతాధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణా రాష్ట్ర రైతాంగానికి నష్టం వాటిల్లే ఏ చర్యలను ప్రభుత్వం చూస్తూ ఊరుకొబోదన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మరోసారి పునరుద్ఘాటించారు.
Read Also : Hyderabad Traffic: హైదరాబాద్‌లో బక్రీద్ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లేవారు అలర్ట్!
We will buy the soaked grain, farmers don’t worry
TG paddy procurement: పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్..
స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో అదీ రబీ సీజన్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఉపక్రమించిందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 66.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేరగా అందులో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. రైతులకు ఇప్పటివరకు 10,097 కోట్ల రూపాయలను చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. 8.15 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరిందని వివరించారు.
కొనుగోలు చేసిన 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 44.67 లక్షల మెట్రిక్ టన్నులు సాధార ణ రకాల ధాన్యం కాగా 12.33 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలని ఆయన వివరించారు. ఇసుక సరఫరా చేసే లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మళ్లించి సత్వరమే ధాన్యాన్ని మిల్లులకు రవాణ చేసేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ముందెన్నడూ లేని రీతిలో 8575 కొనుగోలు కేంద్రా లను ప్రారంభించి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుంటే రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియను రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

