Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో భారీగా తహసీల్దార్ల బదిలీలు

తెలంగాణలో భారీగా తహసీల్దార్ల బదిలీలు

వార్త 2 weeks ago

12 మందికి స్థాన చలనం.. తక్షణమే కొత్త పోస్టుల్లో చేరాలని ఆదేశాలు

TG Tahsildar transfers: తెలంగాణ రెవెన్యూ శాఖలో పరిపాలనా విభాగానికి సం బంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున తహసీల్దార్లను బదిలీ వేస్తూ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ వేసింది. ఏకంగా 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీ ఎస్ఏ కమిషనర్ అధికారికంగా ఆదేశాలు ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ =దిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన తహసీల్దార్లు అందరూ కూడా ఎలాంటి ఆలస్యం చేయకుండా, వెంటనే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాలలో విధుల్లో చేరి ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సీసీఎల్ఎ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులకు తక్షణమే అమల్లోకి వచ్చేలా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా కొత్త పోస్టింగులను కేటాయించారు. ఈ బదిలీలకు సంబంధించిన పూర్తి నివేది కను, అధికారులు విధుల్లో చేరిన వివరాలను ప్రభుత్వానికి తక్షణమే సమర్పించాలని భూపరి పాలన ప్రధాన కమిషనర్ తోపాటు సంబంధిత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Read Also : Vanaparthi Crime: అప్పుల బాధతో భార్యాపిల్లలను చంపి.. ఆ పై తాను ఉరేసుకొని ఆత్మహత్య

 Massive transfers of Tahsildars in Telangana

TG Tahsildar transfers: నూతన పోస్టింగుల పూర్తి వివరాలు

నూతన ఉత్తర్వుల ప్రకారం బదిలీ అయిన వారిలో నిర్మల్ తహశీల్దార్ మోతీరామ్ ఎ. ను మంచిర్యాల డీఆరగా, కరీంనగర్కు చెందిన బి. రాజేశ్వరిని పెద్దపల్లి డీఆర్ ఓగా, పెద్దపల్లికి చెందిన కె.వై. ప్రసాద్ను జగిత్యాల డీఆర్గా నియమించారు. అలాగే వనపర్తి నుంచి ఆర్. పాండును నాగర్ కర్నూల్ డీఆర్గా, ఖమ్మం నుంచి వి. రవికుమార్ ను ములుగు డీఆర్ గా, మేడ్చల్ -మల్కాజిగిరి నుంచి జె. స్వామిని కరీంనగర్ డీఆర్ ఓగా, నాగర్ కర్నూల్ నుంచి ఎ. పాండును కామారెడ్డి డీఆర్ ఓగా బదిలీ చేశారు. వీరితోపాటు జనగామ తహశీల్దార్ సిహెచ్. శ్రీకాంతు మహబూబ్నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏగా నియమించగా, ఎం. సుదర్శన్రెడ్డి (సూర్యాపేట) ను సిద్దిపేట ఎన్డీసీగా, ఎం. రమాదేవి (ఖమ్మం)ను నల్గొండ ఎస్టీసీగా, జి. కుమార స్వామి (పెద్దపల్లి)ను సిరిసిల్ల ఎస్టీసీగా, ఎన్. వెంకట్రెడ్డి (కరీంనగర్)ను కరీంనగర్ ఎస్టీసీ (ఎస్ఏ)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా.. ఇటీవల ఏసీబీ తనిఖీల్లో తహసీల్దార్లు పట్టుబడిన వేళ ఈ బదిలీల ప్రక్రియ రెవెన్యూ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ప్రొ.నాగేశ్వర్ పై తెలంగాణ జనసేన శ్రేణుల ఆగ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha