Cement price fraud:రాష్ట్రంలో గృహ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని సరికొత్త మోసాలు తెరపైకి వస్తున్నాయి. తక్కువ ధరకే బ్రాండెడ్ సిమెంట్ ఇస్తామంటూ నమ్మబలుకుతున్న కొందరు కేటుగాళ్లు, అమాయక ఇళ్ల యజమానులను మోసగించి నగదు కాజేస్తున్నారు.
Kochi Mercedes Accident: హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. నలుగురు పోలీసులపై వేటు
Building a house? – Be careful with ‘cement’ offers!
మోసగాళ్ల సరికొత్త వ్యూహం
పోలీసులు సైబర్ నేరాలను ఎంతగా అణిచివేస్తున్నప్పటికీ, నేరస్థులు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు ఎక్కువగా జరిగే గ్రామీణ ప్రాంతాలను ఈ ముఠాలు టార్గెట్ చేస్తున్నాయి. కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వారిని గుర్తించి, తాము పెద్ద సిమెంట్ వ్యాపారులమని పరిచయం చేసుకుంటారు. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే నాణ్యమైన సిమెంట్ అందిస్తామని ఆశ చూపుతారు.
డబ్బు అందగానే ఫోన్ స్విచ్ ఆఫ్!
తక్కువ ధరకు సిమెంట్ వస్తుందన్న ఆశతో బాధితులు వీరు చెప్పే ఒప్పందానికి సులభంగా అంగీకరిస్తారు.
- డీలర్లకు ఆర్డర్: ఈ మోసగాళ్లు మధ్యవర్తులుగా మారి, అసలైన సిమెంట్ డీలర్లను సంప్రదించి అవసరమైన బస్తాల కోసం ఆర్డర్ ఇస్తారు.
- డెలివరీ సమయంలో మోసం: లారీలో సిమెంట్ బస్తాలు నిర్మాణ ప్రాంతానికి చేరి, వాటిని దింపుతున్న సమయంలో ఇంటి యజమానికి ఫోన్ చేస్తారు.
- నగదు కాజేయడం: యూపీఐ (UPI) ద్వారా డబ్బును తమ వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేయించుకుంటారు. డబ్బు జమ అయిన వెంటనే ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసి పరారవుతారు.
Cement price fraud:నిర్మల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
నిర్మల్ గ్రామీణ మండలం కౌట్ల (కె) గ్రామంలో ఈ తరహా ఘటనే ఒకటి జరిగింది. మార్కెట్లో రూ. 310 ఉన్న సిమెంట్ బస్తాను కేవలం రూ. 260కే ఇస్తామని ఓ వ్యక్తికి కేటుగాడు ఫోన్ ద్వారా ఆశ చూపాడు. దీనికి అంగీకరించిన యజమానికి, ఆ మోసగాడు స్థానిక డీలర్ ద్వారా 250 సిమెంట్ బస్తాలను పంపించాడు.
సిమెంట్ లారీ దిగుతున్న సమయంలో ఇంటి యజమానికి ఫోన్ చేసిన ఆ వ్యక్తి.. రూ. 65,000ను ఫోన్‌పే ద్వారా తన ఖాతాకు పంపాలని కోరగా, యజమాని అలాగే బదిలీ చేశాడు. కాసేపటి తర్వాత డీలర్ డబ్బుల కోసం అడగగా, తాను ఇప్పటికే ఆన్‌లైన్‌లో చెల్లించానని యజమాని తెలిపాడు. దీంతో కంగుతిన్న డీలర్ పరిశీలించగా, డబ్బులు వేరే అపరిచితుడి ఖాతాకు వెళ్లినట్లు తేలింది. బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
Epaper: epaper.vaartha.com

