Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తల్లి ఆశలన్నీ ఆవిరి.. విద్యుత్ తీగ తొక్కి బాలుడు మృతి

తల్లి ఆశలన్నీ ఆవిరి.. విద్యుత్ తీగ తొక్కి బాలుడు మృతి

వార్త 2 months ago

Vinjamuru accident:కన్న కొడుకు ఎదిగొచ్చి ఆసరాగా నిలుస్తాడనుకున్న తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరయ్యాయి. వింజమూరు పట్టణంలోని చల్లా వారి వీధిలో సోమవారం చోటుచేసుకున్న విద్యుదాఘాత ఘటన అందరి హృదయాలను ద్రవింపజేసింది.

చల్లా వారి వీధిలో నివాసం ఉంటున్న పేర్నేటి రాజా మమత దంపతుల కుమారుడు మహిదర్రెడ్డి (13), 9వ తరగతి చదువుతున్నాడు. సోమ వారం వారి ఇంటి పక్కనే పాత బిల్డింగును కూల్చివేస్తుండగా కుతూహలంతో హేమంత్ అక్కడికి వెళ్లి చూస్తున్నాడు. ఆ సమయంలో డ్రిల్లింగ్ మిషన్కు సరఫరా అవుతున్న కరెంటు తీగ నేలపై ఉంది. చెప్పులు లేకుండా వెళ్లిన హేమంత్ పొరపాటున ఆ తీగను తొక్కడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. అమ్మా అంటూ కింద పడిపోయాడు. అక్కడ పనిచేస్తున్న కూలీలు వెంటనే మహిధర్ రెడ్డిని వింజమూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Read also: Vizag Steel Plant Accident: కేజీహెచ్ వద్ద హై టెన్షన్.. మంత్రి లోకేష్‌ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!

 Boy dies after coming into contact with electric wire.

Vinjamuru accident:ఆసరాగా నిలుస్తాడనుకున్న కొడుకు దూరం

కానీ అప్పటికే బాలుడు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి మమత గుండెలవిసేలా రోధించింది. మహిధర్ రెడ్డి తండ్రి కొన్నేళ్ల క్రితమే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తల్లి మమత కూలి పనులు చేస్తూ ఇద్దరు బిడ్డలను సాకుతోంది. రెక్కలు ముక్కలు చేసుకుని ఇద్దరినీ చదివిస్తున్నా, పెద్దవాడే నా ఆసరా అనుకున్నా, ఇప్పుడు వాడూ లేకుండా పోయాడు అంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే చూపరుల హృదయాలు బరువెక్కాయి. మహిధర్ మృతితో చల్లా వారి వీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఉమా మహేశ్వర తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha