Dailyhunt
తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే జట్టులోకి ముకేశ్ చౌదరి!

తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే జట్టులోకి ముకేశ్ చౌదరి!

వార్త 1 week ago

Mukesh Choudhary: ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ యువ ఫాస్ట్ బౌలర్ ముకేశ్ చౌదరిని వ్యక్తిగత విషాదం కలిచివేసింది. గత ఏడాది కాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన తల్లి ప్రేమ్ దేవి (48), మంగళవారం (ఏప్రిల్ 21, 2026) ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

Read Also:Vaibhav Suryavanshi: మ్యాక్స్‌వెల్‌ను దాటేసిన 15 ఏళ్ల కుర్రాడు.. కానీ మొహ్సిన్ ఖాన్ చేతిలో క్లీన్ స్వీప్

ధోనీ గొప్ప మనసు

ఈ కష్టకాలంలో ఎంఎస్ ధోనీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.ముకేశ్ తల్లి చికిత్స పొందుతున్న సమయంలో ధోనీ వ్యక్తిగతంగా ఆస్పత్రికి వెళ్ళి ఆమెను పరామర్శించడమే కాకుండా, ముకేశ్‌కు మానసిక ధైర్యాన్ని ఇచ్చారని తెలుస్తోంది..

 Mukesh Choudhary Mother Passes Away

Mukesh Choudhary: విధి పట్ల అంకితభావం

రాజస్థాన్‌లోని తన స్వగ్రామం భిల్వారాలో తల్లి అంత్యక్రియలు పూర్తి చేసిన ముకేశ్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుధవారం రాత్రి ముంబైలోని జట్టు హోటల్‌కు చేరుకున్నారు. గురువారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ఆయన అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత ముకేశ్ చౌదరి నేరుగా తన స్వగ్రామం భిల్వారాకు వెళ్లాడు. ఆ మ్యాచ్ లో చెన్నై ఓటమి పాలైనప్పటికీ.. ముకేశ్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసకర బ్యాటర్లను వరుస బంతుల్లో ఔట్ చేసి సత్తా చాటాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అతను ఆడిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నికోలస్ పూరన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లక్నో ఫ్యాన్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha