Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తల్లిదండ్రుల పెళ్లి రోజున విషాదం: సర్​ప్రైజ్ ఇవ్వబోయి అనంత లోకాలకు వైద్య విద్యార్థి

తల్లిదండ్రుల పెళ్లి రోజున విషాదం: సర్​ప్రైజ్ ఇవ్వబోయి అనంత లోకాలకు వైద్య విద్యార్థి

వార్త 3 months ago

ల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం (Wedding Anniversary) వేళ ఆ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొనాల్సింది పోయి.. ఊహించని రోడ్డు ప్రమాదం తీరని శోకాన్ని మిగిల్చింది.

కన్నవారికి ముందస్తుగా చెప్పకుండా ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్న ఒక యువ వైద్య విద్యార్థి ప్రయత్నం విషాదాంతమైంది. సిద్దిపేట జిల్లా చేర్యాల సమీపంలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో సదరు యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సంతోషంగా సాగాల్సిన ప్రయాణం కాస్తా ఆ కుటుంబంలో కన్నీటి గాథగా మిగిలిపోయింది.

Read Also: UP Road Accident: వ్యాన్, ట్రక్కు ఢీకొని 10 మంది మృతి!

 Road Accident

Road Accident: తండ్రి కల నిజం చేసే క్రమంలో.. ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతూ..

రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడిని గడసంతల శ్రీసాహిత్‌ (20)గా గుర్తించారు. ఇతని స్వస్థలం చేర్యాల మండలంలోని మల్లాపురం గ్రామం. శ్రీసాహిత్ తల్లిదండ్రులైన సరళ, మధుసూదన్‌లు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పట్టణంలో నివాసముంటోంది. మధుసూదన్ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, శ్రీసాహిత్‌ పెద్దవాడు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో శ్రీసాహిత్ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ (MBBS) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తల్లిదండ్రుల పెళ్లి రోజు కావడంతో వారికి ఆనందాన్ని పంచాలని శ్రీసాహిత్‌ ప్రణాళిక వేసుకున్నాడు.

కాలేజీ నుంచి నేరుగా ఆలేరులోని ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరచాలని భావించాడు. ఇందులో భాగంగా తన స్నేహితులైన అక్షయ్‌, రాఘవలతో కలిసి శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ప్రయాణం ప్రారంభించాడు. అయితే, చేర్యాల పట్టణ శివారులోకి రాగానే రహదారిపై ఉన్న వేగ నిరోధకాన్ని (స్పీడ్ బ్రేకర్) గమనించకపోవడంతో వాహనం అతివేగంగా దానిపై దూసుకెళ్లి అదుపుతప్పింది. అనంతరం రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో శ్రీసాహిత్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్ వెనుక కూర్చున్న అతని ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శ్రీసాహిత్‌ మృతదేహాన్ని ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మల్లాపురం గ్రామంలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నీట్ లీక్ నెట్‌వర్క్ గుట్టు విప్పిన సీబీఐ.. బ్యూటీషియన్ అరెస్ట్‌తో సంచలనం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha