Thalliki vandanam scheme:తల్లికి వందనం పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ అవుతున్నాయి.
సాంకేతిక సమస్యల వల్ల మొదటి విడతలో డబ్బులు పడని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అర్హులైన వారికి మరో అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Read also: Guntur : RRR గన్మెన్లు, జనసేన నేతల మధ్య ఘర్షణ.. !!
Thalliki Vandanam Scheme
అర్హుల జాబితా పరిశీలన మరియు దరఖాస్తుల వివరాలు
గతంలో డబ్బులు అందని వారి కోసం సచివాలయాల్లో ప్రత్యేకంగా జాబితా ఉంచారు. దీనిపై వచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిశీలించారు. మొత్తం 4,470 దరఖాస్తులు రాగా వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Thalliki vandanam scheme:ఈ నెల ముప్పై న ఖాతాల్లో నగదు జమ
అర్హత సాధించిన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఈ నెల ముప్పై తేదీన రూ.13 వేలు జమ కానున్నాయి. కొత్తగా బట్వాడా ప్రక్రియ పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హత ఉన్న కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Epaper: epaper.vaartha.com

