Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తల్లికి వందనంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు!

తల్లికి వందనంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు!

వార్త 2 months ago

Thalliki Vandanam Scheme: జూన్ నెల మధ్యలోకి వచ్చేయడంతో మరికొద్ది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల చదువులు, పుస్తకాలు, ఇతర ఖర్చుల కోసం 'తల్లికి వందనం' పథకం నిధులు ఎప్పుడు విడుదలవుతాయా అని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలోనే ఏపీ విద్యాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి, ఈ పథకానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఆర్థికంగా అండగా నిలిచే ‘తల్లికి వందనం’ పథకం అర్హుల జాబితాను ఎలాంటి లోపాలు లేకుండా, పూర్తి పారదర్శకంగా సిద్ధం చేయాలని అధికారులను స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Read Also : Tirupati TDR Scam: తిరుపతిలో రూ. 414 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం

Thalliki Vandanam Scheme: స్కూల్ ప్రారంభం రోజే కిట్ల పంపిణీ

పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు తెరుచుకునే మొదటి రోజే విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, షూస్ అందించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధికారులు కృషి చేయాలని, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, తాగునీరు, శానిటేషన్ సదుపాయాలు పక్కాగా ఉండాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈ పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇందులో రూ.2,000 పాఠశాల నిర్వహణ నిధికి మినహాయించి, మిగిలిన రూ.13,000లను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. గత ఏడాది దాదాపు 67 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఒకే ఇంట్లో ఎంతమంది అర్హులైన విద్యార్థులు ఉంటే, అంతమందికీ ఈ సాయం వర్తింపజేయడం విశేషం.

లబ్ధిదారులు చేయవలసిన ముఖ్యమైన పనులు

తల్లికి వందనం డబ్బులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఖాతాలో పడాలంటే విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా అనుసంధానమై ఉండాలి. దాంతో పాటు బ్యాంక్ అకౌంట్లకు ఎన్‌పీసీఐ (NPCI) లింకింగ్ కూడా పూర్తవ్వాలి. ఈ వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో తల్లిదండ్రులు ఒకసారి సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హుల జాబితా తయారీ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆ లిస్టును ‘స్వర్ణ గ్రామం’, ‘స్వర్ణ వార్డు’ కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం ప్రదర్శించనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha