Tirupati TDR Scam: ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలో వైసీపీ హయాంలో జరిగిన భారీ టీడీఆర్ (Transferable Development Rights - TDR) బాండ్ల కుంభకోణం లీగల్ మరియు పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ పేరుతో ఏకంగా రూ. 414 కోట్ల మేర భారీ దోపిడీ జరిగినట్లు రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్ధారించారు. వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు, తిరుపతి మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిలు ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు విజిలెన్స్ నివేదికలో తేలింది.
Read also:Chandrababu Delhi Tour: ఆసక్తి గా మారిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. మరో పదవిపై కీలక చర్చలు?
మాస్టర్ ప్లాన్ పేరుతో దందా - విజిలెన్స్ షాకింగ్ నిజాలు
తిరుపతి నగరాభివృద్ధి కోసం ఉద్దేశించిన మాస్టర్ ప్లాన్ రోడ్లను అడ్డం పెట్టుకుని భూమన కుటుంబం కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినట్లు అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు.
- కమర్షియల్ ల్యాండ్‌గా మార్పిడి: సామాన్యులకు సంబంధించిన సాధారణ ఇళ్ల స్థలాలను రికార్డుల్లో రాత్రికి రాత్రే భారీ విలువైన వాణిజ్య భూములుగా (Commercial Lands) మార్చేశారు. తద్వారా ఆ భూములకు మార్కెట్ ధర కంటే వందల రెట్లు ఎక్కువ విలువ వచ్చేలా చూసి, తప్పుడు లెక్కలతో భారీ మొత్తంలో టీడీఆర్ బాండ్లను సృష్టించారు.
- భూ యజమానులపై బెదిరింపులు: లొంగని స్థానిక భూ యజమానులను, వ్యాపారస్తులను భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు తమ అధికార బలంతో భయభ్రాంతులకు గురిచేసినట్లు విజిలెన్స్ విచారణలో బాధితులు స్వయంగా వెల్లడించారు. తాము చెప్పిన ధరకే భూములు రాసివ్వాలని, లేదంటే ఇళ్లు కూల్చేస్తామంటూ బెదిరించి ల్యాండ్ మాఫియా తరహాలో దందా సాగించారు.
Tirupati TDR Scam: అధికారుల అండదండలు - 30 మందిపై చర్యలకు సిఫార్సు
ఈ రూ. 414 కోట్ల మెగా స్కామ్ కేవలం రాజకీయ నేతలతోనే సాధ్యం కాలేదని.. మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించారని విజిలెన్స్ తేల్చింది. ఈ మేరకు అవినీతికి సహకరించిన పెద్ద తలకాయలపై చర్యలకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి:
- నలుగురు మున్సిపల్ కమిషనర్లు: కుంభకోణం జరిగిన కాలంలో తిరుపతిలో పనిచేసిన నలుగురు మున్సిపల్ కమిషనర్లపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేశారు.
- ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లు: తప్పుడు డాక్యుమెంట్లను కళ్లు మూసుకుని రిజిస్ట్రేషన్ చేసిన ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లపై విచారణకు ఆదేశించారు.
- 20 మంది ప్లానింగ్ సిబ్బంది: టౌన్ ప్లానింగ్ (పట్టణ ప్రణాళిక) విభాగంలో అవినీతికి పాల్పడిన 20 మంది సిబ్బందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

