Talliki Vandanam scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం రెండో విడత నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
తొలి విడతలో సాంకేతిక కారణాలు, అడ్మిషన్ల జాప్యం వల్ల పథకం ప్రయోజనం పొందలేకపోయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను నిర్వహించింది. క్షేత్రస్థాయి పరిశీలన, రీ-వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 3,29,201 మంది తల్లులు, విద్యార్థులను అర్హులుగా అధికారులు ఖరారు చేశారు.
Read Also : Nara Lokesh: 'రణబాలి'.. ట్రైలర్‌పై మంత్రి లోకేశ్ ప్రశంసలు
List of beneficiaries for the second phase of ‘Thalliki Vandanam’ released.
Talliki Vandanam scheme: 2026-27 విద్యా సంవత్సరానికి రూ.10,208.69 కోట్ల కేటాయింపు
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి ప్రభుత్వం రూ. 10,208.69 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ రెండో విడత లబ్ధిదారులను చేర్చడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఏకంగా 68.05 లక్షలకు చేరింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థులందరికీ ఆర్థిక భరోసా కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నిధులను వెచ్చిస్తోంది.
ఖాతాల్లో జమ అయ్యేది ఎంతంటే?
ఈ పథకం కింద అర్హత పొందిన ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. పాఠశాలల మౌలిక వసతులు, నిర్వహణ నిధి కింద రూ. 2,000 మినహాయిస్తారు. మిగిలిన రూ. 13,000 నూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతిలో అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. తొలి విడతలో లబ్ధి పొందని వారు తమ ఆధార్ వివరాలు, పాఠశాల రికార్డులను సచివాలయాలు లేదా సంబంధిత వెబ్‌సైట్ పోర్టల్ ద్వారా సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.

