Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టమాటా ధరకు రెక్కలు.. కిలో ఎంతో తెలుసా?

టమాటా ధరకు రెక్కలు.. కిలో ఎంతో తెలుసా?

వార్త 2 months ago

Tomato Prices Today: ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన మదనపల్లి టమాటా మార్కెట్‌లో మంగళవారం ధరలు ఆశాజనకంగా నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా సరైన ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రస్తుత రేట్లు ఊరటనిస్తున్నాయి.

ఈ వేలంలో మొదటి రకం నాణ్యత గల టమాటాలు కిలోకు గరిష్టంగా రూ.28 వరకు పలికాయి. మార్కెట్ ఒడిదుడుకుల మధ్య ఈ ధర నమోదు కావడం విశేషం.

Read also: Gold price 14/04/26 : యుద్ధ అనిశ్చితి మధ్య బంగారం ధరలు తగ్గింపు

Madanapalle Market Tomato Price Update

Tomato Prices Today: భారీగా తరలివచ్చిన టమాటా నిల్వలు

మంగళవారం జరిగిన మార్కెట్ వేలానికి రైతులు సుమారు 174 మెట్రిక్ టన్నుల టమాటాలను తరలించారు. మార్కెట్‌లో కొనుగోలుదారులు పోటీ పడటంతో ధరలు నిలకడగా ఉన్నాయి. టమాటా సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో మార్కెట్ ప్రాంతమంతా సందడిగా మారింది. దిగుబడికి తగ్గట్లుగా వ్యాపారులు కూడా కొనుగోళ్లలో ఉత్సాహం చూపిస్తున్నారు.

హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం

పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి వస్తాయో రావో అని ఆందోళన చెందిన రైతులకు ఈ ధరలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. కిలో రూ.28 ధర పలకడం వల్ల సాగు ఖర్చులు పోను కొంత లాభం మిగిలే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. ధరలు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది టమాటా సాగు లాభసాటిగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రూ.15 వేల లోపే రెడ్‌మీ కొత్త 5G ఫోన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha