Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tamil Cinema: విజయ్ సినిమా 'జన నాయగన్' రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్

Tamil Cinema: విజయ్ సినిమా 'జన నాయగన్' రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్

వార్త 4 months ago

మిళ సినీ(Tamil Cinema) పరిశ్రమలో సూపర్ స్టార్‌గా పేరు గడించిన దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' విడుదలకు సంబంధించిన అడ్డంకులు తొలగుతున్నాయి.

సెన్సార్ అంశంపై కొనసాగుతున్న వివాదంలో నిర్మాత వేసిన కేసును ఉపసంహరించుకునేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సినిమా ఇప్పుడు సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ పరిశీలనకు వెళ్లనుంది.

విజయ్ చివరి సినిమా

సెన్సార్ బోర్డు నుంచి తుది అనుమతి లభిస్తే, ఈ నెలలోనే థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.

విజయ్ రాజకీయాల్లోకి(Tamil Cinema) అడుగుపెట్టే ముందు వచ్చే చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో అపారమైన ఆసక్తి నెలకొంది. ట్రైలర్, టీజర్‌కు ఇప్పటికే భారీ స్పందన లభించగా, సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ఓపెనింగ్ సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా 'జన నాయగన్' విజయ్ కెరీర్‌లో ఒక కీలక మైలురాయిగా నిలవనుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు ఈ చిత్రాన్ని విజయ్‌కు ఒక భావోద్వేగ గుడ్‌బైగా భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha