Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tamil Nadu Elections: సీఎం స్టాలిన్ ఓటమి

Tamil Nadu Elections: సీఎం స్టాలిన్ ఓటమి

వార్త 2 weeks ago

Tamil Nadu Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే (DMK) ఊహించని దెబ్బ తగిలింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓటమి పాలయ్యారు.

దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో స్టాలిన్ ఓడిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Read Also : Election Results: నార్త్ టు ఈస్ట్.. కమల వికాసం

Tamil Nadu Elections: కొళత్తూరులో ముగిసిన స్టాలిన్ హవా?

దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న స్టాలిన్, ఒక కొత్త పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం డీఎంకే శ్రేణులను కోలుకోలేని దెబ్బ తీసింది. కొళత్తూరు నియోజకవర్గంలో మొదటి నుంచి హోరాహోరీ పోరు సాగినప్పటికీ, అంతిమంగా టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు విజయం సాధించారు. ముఖ్యమంత్రి అభ్యర్థియే ఓడిపోవడంతో రాష్ట్రంలో అధికార మార్పిడి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యం

మరోవైపు, స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాత్రం తన నియోజకవర్గమైన చెపాక్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తండ్రి ఓటమి పాలైన చోట కుమారుడు గెలుపు దిశగా సాగడం గమనార్హం. అయినప్పటికీ, పార్టీ అధినేత ఓటమితో డీఎంకే కౌంటింగ్ కేంద్రాల వద్ద నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha