Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నార్త్ టు ఈస్ట్.. కమల వికాసం

నార్త్ టు ఈస్ట్.. కమల వికాసం

వార్త 1 month ago

Election Results: పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుండటంతో దేశ రాజకీయ చిత్రం వేగంగా మారుతోంది. ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో, ప్రస్తుతం దేశంలోని ఏయే రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందో స్పష్టం చేస్తూ పార్టీ ఒక ప్రత్యేక మ్యాప్‌ను విడుదల చేసింది.

ఉత్తర భారతం నుంచి ఈశాన్యం వరకు సాగుతున్న ఈ రాజకీయ పరివర్తనలో 'బెంగాల్ విజయం' ఒక మైలురాయి అని బీజేపీ అభివర్ణించింది.

Read Also:Trisha Birthday Special:విశ్వంభర'లో అవనిగా త్రిష.. మెగాస్టార్ సినిమా నుంచి బర్త్ డే సర్ప్రైజ్!

Election Results: అభివృద్ధిపై ప్రజల నమ్మకం

బెంగాల్‌లో సాధించిన ఈ ఆధిక్యం కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి మంత్రంపై ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకమని బీజేపీ పేర్కొంది. దశాబ్దాల నాటి కుటుంబ పాలనను, ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని కాదని ప్రజలు కమలం వైపు మొగ్గు చూపుతున్నారని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

విస్తరిస్తున్న కాషాయ జెండా

ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం హ్యాట్రిక్ విజయం దిశగా సాగుతుండటం, బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రంలో మొదటిసారి అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయికి చేరడం బీజేపీ వ్యూహాలకు నిదర్శనం. విడుదల చేసిన మ్యాప్ ప్రకారం, దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ లేదా దాని మిత్రపక్షాల (NDA) పాలన సాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

దళపతికి టాలీవుడ్ విషెస్! విజయ్ గెలుపుపై రాజశేఖర్ ఏమన్నారంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha