Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tamil Nadu: TVK ప్రభుత్వానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్

Tamil Nadu: TVK ప్రభుత్వానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్

వార్త 3 months ago

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

గురువారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసిన విజయ్, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం తన వద్ద ఉందని తెలియజేశారు. విజయ్ అందించిన మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్, ప్రభుత్వ ఏర్పాటుకు అధికారికంగా అనుమతిని ఇచ్చారు.

Read Also : సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్య?

 Tamil Nadu: Governor gives green signal to TVK government

దిగ్గజాల వారసుడిగా..

తమిళ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నాయకుల తర్వాత, అంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడిగా విజయ్ ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ ఒక కొత్త రాజకీయ శకానికి ఆయన శ్రీకారం చుట్టారు.

నేడు సాయంత్రమే ప్రమాణ స్వీకారం?

విజయ్ తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకుంటానని గవర్నర్‌కు హామీ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం, ఈ రోజు సాయంత్రమే ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో AIADMK

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha