Dailyhunt
తమిళ రాజకీయాల్లోకి దర్శకుడు సుందర్ సీ

తమిళ రాజకీయాల్లోకి దర్శకుడు సుందర్ సీ

వార్త 3 weeks ago

Director Sundar C Political Entry: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు, నటుడు సుందర్ సీ రాజకీయ అరంగేట్రం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు . రాబోయే ఎన్నికల్లో ఆయన మధురై సెంట్రల్ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

అన్నా డీఎంకే (AIADMK) మిత్రపక్షమైన పుదియ నీథి కచ్చి (PNK) తరపున ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Read Also: Jaish-e-Mohammed: పెరుగుతున్న జైషే టెర్రరిస్టుల ఆగడాలు!

Director Sundar C Political Entry:పీఎన్కే (PNK) – అన్నా డీఎంకే పొత్తు

2001లో ఆరణి చొక్కలింగం షణ్ముగం స్థాపించిన పుదియ నీథి కచ్చి, ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో జతకట్టింది. సీట్ల పంపకాల్లో భాగంగా పీఎన్కేకు రెండు స్థానాలు దక్కగా, అందులో మధురై సెంట్రల్ ఒకటి. ఇక్కడి నుండి సుందర్ సీ పోటీ చేస్తారని పార్టీ అధినేత షణ్ముగం అధికారికంగా ప్రకటించారు. సుందర్ సీకి ఇది తొలి అసెంబ్లీ ఎన్నిక కావడం విశేషం. రెండో అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 Director Sundar C Politics Entry Madurai Central

తమిళనాడు ఎన్నికల షెడ్యూల్ 2026

కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తమిళనాడులో ఎన్నికల పర్వం ఇలా సాగనుంది:

  • పోలింగ్ తేదీ: ఏప్రిల్ 23, 2026 (ఒకే దశలో).
  • ఫలితాల విడుదల: మే 4, 2026.
  • ముఖ్య పార్టీలు: డీఎంకే (DMK), అన్నా డీఎంకే (AIADMK), విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

నటి ఖుష్బూ తర్వాత ఆమె భర్త సుందర్ సఈ కూడా ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దర్శకుడు, నటుడు, గాయకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాతగా సుందర్ సీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన తీసిన హార్రర్ కామెడీ సినిమాల సిరీస్ ఆరణ్మనై.. తెలుగులో చంద్రకళ, కళావతి, అంతఃపురం, బాక్ పేర్లతో డబ్ అయ్యాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha