Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించనివి: లోక్‌సత్తా జేపీ విశ్లేషణ

తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించనివి: లోక్‌సత్తా జేపీ విశ్లేషణ

వార్త 2 weeks ago

Jayaprakash Narayan on Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సాధించిన చారిత్రక విజయంపై లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ (JP) చేసిన విశ్లేషణాత్మక వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ విజయానికి గల కారణాలు, దాని పర్యవసానాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Read Also:results from surveys : సర్వేలకు అందని ఫలితాలతో పార్టీల్లో అయోమయం

ఊహించని ఫలితాలు – ఒక కొత్త ప్రత్యామ్నాయం

దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను ఏలుతున్న డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను కాదని, పార్టీ పెట్టిన రెండేళ్లలోనే 108 స్థానాలు గెలుచుకోవడం ఎవరూ ఊహించని ఫలితమని జేపీ అభిప్రాయపడ్డారు.కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర నటులకు సైతం దక్కని రాజకీయ విజయం విజయ్‌కు దక్కడం విశేషమని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో మార్పు కోరుకుంటున్న ప్రజలు ఒక బలమైన ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపారని ఆయన విశ్లేషించారు.

 Tamil Nadu Election Results 2026

తెలంగాణలో కేవలం హైదరాబాద్‌కే అభివృద్ధి పరిమితమైందని, కానీ తమిళనాడులో 50 శాతం పట్టణీకరణ ఉండటం వల్ల అభివృద్ధి విస్తృతంగా ఉందని జేపీ తెలిపారు.ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తున్నప్పటికీ, ప్రజలు కొత్తదనం కోసం టీవీకే వైపు మళ్లారని ఆయన పేర్కొన్నారు.

Jayaprakash Narayan on Vijay: జన్‌జీ (Gen-Z) ఆకాంక్షలు – ఒక హెచ్చరిక

నేటి యువత (జన్‌జీలు) ‘ఒకే ఒక్కడు’ సినిమా తరహాలో క్షణాల్లో అద్భుతాలు జరగాలని, అభివృద్ధి వెంటనే జరిగిపోవాలని ఆశిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.ఏదైనా అభివృద్ధి జరగాలంటే కొంత సమయం పడుతుందని, అనుకున్నంత వేగంగా అన్నీ జరగవని ఆయన స్పష్టం చేశారు.ఇలాంటి తక్షణ ఫలితాలను ఆశించే ధోరణి రాజకీయ వ్యవస్థకు కొంత ప్రమాదకరమని, నేపాల్ వంటి దేశాల్లో జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు, తన నటనతో జనాలను మెప్పించిన మెుహం.. పెద్దగా సిద్ధంత ప్రతిపాదిక ఏం లేకుండా.. నెగ్గటం అనేది నిజంగా దిగ్భ్రాంతికరం.’ అని జయ ప్రకాశ్ నారాయణ వ్యాఖ్యనించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha