DK Shivakumar on Vijay TVK: నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీసుకున్న నిర్ణయంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు.
గవర్నర్ చర్య పూర్తిగా అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు.
Read Also:Kerala Congress : మహిళా ఎమ్మెల్యేను హగ్ చేసేందుకు కాంగ్రెస్ నేత యత్నం
మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి
గురువారం బెంగళూరులోని విధాన సౌధలో విలేకరులతో మాట్లాడిన శివకుమార్, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు.సంఖ్యాబలం ఉన్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, మెజారిటీ నిరూపించుకోకుండా అడ్డుకునే అధికారం గవర్నర్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు.”ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను అడ్డుకునే అధికారం తమిళనాడు గవర్నర్‌కు ఏమాత్రం లేదు. ఆయన ప్రవర్తన సరైనది కాదు” అని డీకే శివకుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Tamil Nadu Governor Controversy
గతంలో కర్ణాటక, జాతీయ స్థాయిలో జరిగిన ఉదాహరణలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.కర్ణాటకలో మాజీ సీఎం యడియూరప్పను, కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయిని అతిపెద్ద పార్టీలుగా గుర్తించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.మాజీ రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఇదే ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించారని ఆయన తెలిపారు. అదే విధంగా టీవీకే పార్టీకి కూడా బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
DK Shivakumar on Vijay TVK: ప్రజా తీర్పును గౌరవించాలి
ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు కూడా ఫలితాన్ని మార్చగలదని, ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన హితవు పలికారు. ఒకవేళ వారు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే, అప్పుడు తదుపరి ప్రత్యామ్నాయాన్ని పరిశీలించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

