Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళా ఎమ్మెల్యేను హగ్ చేసేందుకు కాంగ్రెస్ నేత యత్నం

మహిళా ఎమ్మెల్యేను హగ్ చేసేందుకు కాంగ్రెస్ నేత యత్నం

వార్త 3 months ago

కాంగ్రెస్ కార్యాలయంలో వివాదాస్పద ఘటన

Kerala Congress : కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

సీనియర్ కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్ మహిళా ఎమ్మెల్యే బిందు కృష్ణను పబ్లిక్‌గా కౌగిలించుకునేందుకు యత్నించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన తిరువనంతపురం లోని పార్టీ కార్యాలయంలో చోటుచేసుకుంది. కొల్లాం నియోజకవర్గం నుంచి గెలిచిన బిందు కృష్ణ పార్టీ ఆఫీసుకు వచ్చిన సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికారు.

షేక్ హ్యాండ్‌కు బదులుగా హగ్ ప్రయత్నం

వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం.. బిందు కృష్ణ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా చెరియన్ ఫిలిప్ ఆమెను హగ్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచినట్లు కనిపించింది. అయితే చెరియన్ ఫిలిప్ మళ్లీ ఆమెను కౌగిలించుకునేందుకు యత్నించగా, ఆమె అతడిని పక్కకు నెట్టి ముందుకు వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also:SBI : సమ్మె బాట పట్టబోతున్న SBI ఉద్యోగులు !!

సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు

చెరియన్ ఫిలిప్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులకు (Kerala Congress) గౌరవం ఇవ్వాలని, ఈ ఘటనపై పార్టీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా మహిళలపై చేసిన వ్యాఖ్యలతో చెరియన్ ఫిలిప్ వివాదాల్లో నిలిచారని పలువురు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో విజయ్ ఎంట్రీ - వీడియో వైరల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha