Dailyhunt
తమిళనాడు, కేరళలో అధికార మార్పు?

తమిళనాడు, కేరళలో అధికార మార్పు?

వార్త 3 weeks ago

తమిళనాడు, కేరళలో మార్పు సూచనలు

Matrize Survey Election : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలపై మ్యాట్రిజ్ సర్వే కీలక అంచనాలు వెల్లడించింది.

తమిళనాడు, కేరళలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు మారే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా తమిళనాడులో అధికార డీఎంకే కూటమికి గట్టి ఎదురుగాలి వీస్తోందని తెలిపింది.

బెంగాల్‌లో హోరాహోరీ పోరు

పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మరియు బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఉండనున్నట్లు సర్వే పేర్కొంది. టీఎంసీకి స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ, బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తోందని అంచనా వేసింది. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండొచ్చని పేర్కొంది.

Read Also:Natasa Stankovic: హార్దిక్ పాండ్యా ఇంట్లో నటాషా.. విడాకుల తర్వాత మళ్ళీ కలిశారా? ఫోటోలు చూస్తే షాక్!

 Matrize Survey Election

అసోంలో బీజేపీ హ్యాట్రిక్

అసోంలో మాత్రం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మ్యాట్రిజ్ సర్వే తెలిపింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో బీజేపీ కూటమి 92 నుంచి 102 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

జెనోవాపై జువెంటస్ ఘనవిజయం: ఛాంపియన్స్ లీగ్ బెర్తు దిశగా అడుగు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha