Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడు ఓటర్ల మొగ్గు అటే.. జేవీసీ పోల్ అంచనా

తమిళనాడు ఓటర్ల మొగ్గు అటే.. జేవీసీ పోల్ అంచనా

వార్త 2 months ago

Tamil Nadu Election Survey: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్ల నాడిని పట్టుకునేందుకు వివిధ సంస్థలు సర్వేలు నిర్వహిస్తుండగా, తాజాగా 'జేవీసీ పోల్' (JVC poll) తన తుది నివేదికను విడుదల చేసింది.

ఈ సర్వే అంచనాల ప్రకారం.. తమిళనాట ఈసారి అధికార మార్పిడి ఖాయమని తెలుస్తోంది.

జేవీసీ పోల్ సర్వే ప్రకారం, విపక్ష అన్నాడీఎంకే (AIADMK) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించబోతోంది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, అన్నాడీఎంకే కూటమి ఏకంగా 140 నుంచి 159 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఓట్ల శాతం పరంగా కూడా 38.8% నుంచి 40.2% ఓటర్లు అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపుతున్నారు.

Read Also: Germany Gurdwara: జర్మనీ గురుద్వారాలో ఘర్షణ: 11 మందికి తీవ్ర గాయాలు

 Tamil Nadu voters’ preference is… JVC poll final survey

Tamil Nadu Election Survey: చతికలపడనున్న అధికార డీఎంకే.. విజయ్ పార్టీ ప్రభావం ఎంత?

ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే (DMK) కూటమికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగలనుందని సర్వే పేర్కొంది. డీఎంకే కూటమి కేవలం 70 నుంచి 92 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన కొత్త పార్టీ టీవీకే (TVK) ఓట్ల శాతాన్ని గణనీయంగా చీల్చినప్పటికీ, సీట్ల పరంగా మాత్రం కేవలం 2 నుంచి 5 స్థానాలకే పరిమితం కావొచ్చని జేవీసీ పోల్ విశ్లేషించింది. టీవీకే సుమారు 17.7% నుంచి 20.2% ఓట్లను సాధించే ఛాన్స్ ఉంది.

ఎన్నికల ప్రచారం ముగుస్తున్న తరుణంలో వెలువడిన ఈ సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికార వ్యతిరేకత కూటమి సమీకరణాలు అన్నాడీఎంకేకు లాభించబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఓటర్ల తుది తీర్పు ఈ అంచనాలకు అనుగుణంగా ఉంటుందో లేదో తెలియాలంటే పోలింగ్ ముగిసి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసిన డీఎంకే అభ్యర్థి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha