Dailyhunt
సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసిన డీఎంకే అభ్యర్థి!

సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసిన డీఎంకే అభ్యర్థి!

వార్త 1 week ago

Thousand Lights Constituency Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ చెన్నై రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా విఐపి నియోజకవర్గంగా పేరుగాంచిన 'థౌజండ్ లైట్స్'లో డీఎంకే అభ్యర్థి డాక్టర్ ఎళీలన్, సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

స్వయంగా రజనీకాంత్ నివాసానికి వెళ్లి కలవడంతో, ఈ భేటీ వెనుక రాజకీయ మద్దతు ఉందా అనే ఉత్కంఠ నెలకొంది.

సోమవారం ఉదయం డాక్టర్ ఎళీలన్ పోయస్ గార్డెన్‌లోని రజనీకాంత్ నివాసానికి వెళ్లారు. గత ఐదేళ్లలో తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల నివేదికను ఆయనకు అందజేశారు. రజనీకాంత్ ఇదే నియోజకవర్గ ఓటరు కావడంతో, ఒక అభ్యర్థిగా ఆయన్ను కలిసి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ అని ఎళీలన్ పేర్కొన్నారు. రజనీకాంత్‌ను ‘మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ’ అని కొనియాడుతూ ఆయన షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Also: Warangal ACB Arrest: వరంగల్ సబ్ రిజిస్ట్రార్ల లంచాల గుట్టు రట్టు

Thousand Lights Constituency Elections: చతుర్ముఖ పోటీలో ‘వెయ్యి దీపాల’ నియోజకవర్గం

ఈసారి థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలతో పాటు కొత్త శక్తులు రంగంలోకి దిగడంతో సమీకరణాలు మారిపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఎళీలన్ తన పట్టును నిలుపుకోవాలని చూస్తున్నారు. అన్నాడీఎంకే మాజీ మంత్రి వలర్మతి గట్టి పోటీ ఇస్తున్నారు. సీమాన్ పార్టీ తరపున దర్శకుడు కళంజియం బరిలో ఉన్నారు. దళపతి విజయ్ పార్టీ మద్దతుతో జేసీడీ ప్రభాకర్ పోటీ చేస్తుండటంతో యువత ఓట్లు ఎటు మొగ్గుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది.

గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఖుష్బు సుందర్‌పై భారీ మెజారిటీతో గెలిచిన ఎళీలన్‌కు, ఈసారి పరిస్థితి సవాల్‌గా మారింది. రజనీకాంత్ ఏ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలపకపోయినప్పటికీ, ఆయన అభిమానులు, ఆయన నివసించే నియోజకవర్గ ఓటర్లపై ఈ భేటీ ప్రభావం చూపే అవకాశం ఉంది. విజయ్ రాజకీయ రంగప్రవేశం తర్వాత మారుతున్న లెక్కల మధ్య ‘తలైవా’ మౌనం ఎవరికి లాభిస్తుందో చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఆసుపత్రిలో సిబ్బంది లేరని రోగికి కుట్లు వేసిన సెక్యూరిటీ గార్డు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha