Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం .. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం .. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా

వార్త 2 weeks ago

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని భారీ సంచలనం నమోదైంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కు ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఊహించని షాక్ ఇచ్చారు.

పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తమ MLA పదవులకు ఈ ముగ్గురు నేతలు రాజీనామా చేశారు. తమిళ సినీ నటుడు, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో, అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో వీరు విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం.. ఆ వెంటనే రాజీనామాలు సమర్పించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Read Also : Twisha Sharma death case: ట్విషా శర్మ మృతి కేసు: న్యాయవ్యవస్థపై ప్రచారంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం

 : Sensation in Tamil Nadu politics.. Three AIADMK MLAs resign

Tamil Nadu Politics: నేరుగా స్పీకర్‌కే రాజీనామా లేఖలు

అన్నాడీఎంకేకు గుడ్‌బై చెప్పిన వారిలో ప్రముఖ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరగాథం, సత్యభామ, జయకుమార్, ఈ ముగ్గురు నేతలు శాసనసభ స్పీకర్‌ను నేరుగా కలిసి తమ అధికారిక రాజీనామా లేఖలను అందజేశారు. శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వెంటనే ఈ ముగ్గురు నేతలు.. టీవీకే ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఆదవ్ అర్జునతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రి అర్జున సమక్షంలోనే వీరు త్వరలోనే అధికారికంగా తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

అన్నాడీఎంకేకు కోలుకోలేని దెబ్బ..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తదనంతర పరిణామాలతో ఇప్పటికే డీలా పడ్డ అన్నాడీఎంకేకు, ఈ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామా కోలుకోలేని దెబ్బగా మారింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రోజురోజుకూ పుంజుకుంటూ విపక్ష నేతలను తనవైపు తిప్పుకుంటుండటంతో తమిళనాట సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచింది. రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే నుండి మరికొందరు సీనియర్ నేతలు కూడా టీవీకే బాట పట్టే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

చెత్త కుప్పలో 300కు పైగా ఆవుల కళేబరాలు.. కాంట్రాక్టర్‌కు నోటీసులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha