Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడులో మందు కొనాలంటే ఆధార్ తప్పనిసరి

తమిళనాడులో మందు కొనాలంటే ఆధార్ తప్పనిసరి

వార్త 1 week ago

TN CM Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ రాష్ట్రంలో మద్యపానాన్ని నియంత్రించే దిశగా సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యువతను డ్రగ్స్, మద్యానికి దూరంగా ఉంచడమే లక్ష్యంగా ఆయన పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలకు సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేయించిన విజయ్, తాజాగా విక్రయాల విషయంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు.

Read Also:Petrol Diesel Price Hike: లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 పెంపు.. నేటి నుంచే అమలు

21 ఏళ్లు నిండితేనే విక్రయం.. ఆధార్ తప్పనిసరి

రాష్ట్రంలో పెరుగుతున్న మద్యపాన వ్యసనాన్ని అరికట్టేందుకు 21 ఏళ్ల లోపు వారికి మద్యం అమ్మకూడదని సీఎం విజయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేసేందుకు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) రంగంలోకి దిగింది. ఇకపై మద్యం కొనుగోలు చేసేవారు తమ వయస్సును నిరూపించుకోవడానికి ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.

TN CM Vijay: జైలు శిక్ష తప్పదని హెచ్చరిక

వయస్సు ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేయకుండా 21 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయించే షాపు యజమానులు, సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలుకు పంపుతామని టాస్మాక్ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

 TN CM Vijay Liquor Policy

వేళల తగ్గింపుపై కసరత్తు

మద్యం దుకాణాలు పని చేసే సమయాన్ని కూడా తగ్గించే దిశగా విజయ్ సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు సాగుతున్నాయి. అయితే, నేరాలు, ప్రమాదాలను తగ్గించేందుకు దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసివేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

ఎన్నికల హామీ అమలు

రాష్ట్రం నుండి డ్రగ్స్‌ను పూర్తిగా అరికడతామని విజయ్ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఆ దిశగా వరుస నిర్ణయాలు తీసుకోవడం పట్ల మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజయ్ తీసుకుంటున్న ఈ ‘బోల్డ్’ నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

భారత రాజధానే లక్ష్యం.. పాక్ కొత్త మిస్సైల్ 'ఫతా-4' వెనుక అసలు ప్లాన్!,

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha