Dailyhunt
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ: కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్!

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ: కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్!

వార్త 3 days ago

Vijay TVK Congress Support: తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) అఖండ విజయాన్ని నమోదు చేసింది.

శాసనసభ ఎన్నికల్లో ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించి, రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం సినిమా గ్లామర్‌తోనే కాకుండా, పక్కా ప్రణాళికతో విజయ్ తన ప్రజాబలాన్ని నిరూపించుకున్నారు.

Read Also:TVK Won : TVK విజయ్ విజయం వెనుక ప్రధాన సూత్రధారి అతడే !!

అయితే,ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌కు కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. ఈ సందిగ్ధతను వీడి అధికారాన్ని చేపట్టేందుకు టీవీకే అధినేత విజయ్ ఇతర పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ పార్టీ మద్దతును ఆయన కోరినట్లు సమాచారం.

 KC Venugopal on Tamil Nadu Elections

Vijay TVK Congress Support: కేసీ వేణుగోపాల్ వెల్లడి – తమిళనాడు శాఖదే తుది నిర్ణయం

విజయ్ తమ మద్దతు కోరిన విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ధృవీకరించారు. అయితే, టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా లేదా అనే నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ శాఖకే అప్పగించినట్లు ఆయన స్పష్టం చేశారు. స్థానిక రాజకీయ సమీకరణాలు, భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు కాంగ్రెస్ నేతలు త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

భవన నిబంధనల్లో భారీ మార్పులు ఏం మారింది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha