Meenakshi Natarajan : రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
బిజెపి నేతలే సమాచారాన్ని లీక్ చేయడం వల్లే ఈ తిరస్కరణ జరిగిందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ తనదైన శైలిలో స్పందించారు. తనపై ఉన్న క్రిమినల్ లేదా లీగల్ కేసుల గురించిన కనీస సమాచారం అభ్యర్థి అయిన మీనాక్షికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తప్పులు చేసి ఇతరులపై నెట్టడం సరికాదని, నామినేషన్ తిరస్కరణకు బిజెపి కారణమనే వాదనల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
Read Also : మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన
mp dharmapuri aravind strong counter to cm revanth‘పొట్టోడు’ అంటూ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు
ఈ వ్యవహారం వెనుక కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు మరియు కుట్రలు ఉన్నాయనే అనుమానాలను ఎంపీ అర్వింద్ వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే చాటుగా సమాచారం లీక్ చేశారనే చర్చ కూడా నడుస్తోందని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రనా, లేక పొట్టోడి కుట్రనా అనేది ఆ పార్టీ నేతలే సమీక్షించుకోవాలి” అంటూ వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులు ‘పొట్టోడు’ అని ఎవరిని ఉద్దేశించి అన్నారని ప్రశ్నించగా, ఆయన సూటిగా రేవంత్ రెడ్డి పేరిట సమాధానం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాల వల్లే నామినేషన్ చెల్లకుండా పోయిందని అర్వింద్ ఆరోపించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
NIRలకు గుడ్ న్యూస్.. ఎఫ్‌సీఎన్‌ఆర్ డిపాజిట్లపై భారీగా పెరిగిన వడ్డీ రేట్లు!

