Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఉరి వేసుకుని మృతిచెందిన తల్లీ, కొడుకులు

తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఉరి వేసుకుని మృతిచెందిన తల్లీ, కొడుకులు

వార్త 2 weeks ago

అబ్దుల్లాపూర్మెట్ లో ఘటన

Abdullapurmet Crime: నగర శివారులోని అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధి లష్కర్గూడ గ్రామ పంచాయతీ కనకదురా నగర్ కాలనీలో బుధవారం విషాదం చోటు చేసుకుంది.

ఆరు మాసాల క్రితం తండ్రి మృతిచెందడంతో తల్లితోకలిసి ఉంటున్న ఓ యువకుడు తీవ్ర మానసిక వేదనకు గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, కళ్ల ముందే తన కొడుకు ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేక తల్లి కూడా చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Read Also : Indian student killed in canada: కెనడాలో భారత యువతి ప్రాణాలు తీసిన గుర్తుతెలియని వ్యక్తి

 Mother and son hang themselves to death after Unable to cope with father’s death

Abdullapurmet Crime: లష్కర్గూడ కనకదుర్గానగర్ కాలనీలో ఘోర విషాదం

ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం… లష్కర్గూడలోని కనకదుర్గానగర్ కాలనీలో పసుల కళావతి (45) అనే మహిళ ఆమె కుమారుడు శివ (20)తో కలిసి నివాసముంటోంది. అయితే గత ఆరు మాసాల క్రితం కళావతి భర్త కళాధర్ మృతిచెందడంతో అప్పటి నుంచి కళావతి, శివకుమార్ లు మానసిక వేదనకు గురవుతున్నారు. అయితే బుధవారం ఉదయం శివకుమార్ ఫ్యాన్కుఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, తన కళ్లముందే తన కుమారుడు తనువు చాలించడాన్ని చూసి తట్టుకోలేక పక్కనే చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీ లించారు. నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి, కొడుకు ఒకే సారి ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికంగా విషాధం నెలకొన్నది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన భారీ మంటలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha