Indian student killed in canada: విదేశాల్లో భారతీయ విద్యార్థుల భద్రతపై మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మరో భారతీయ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది.
గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల యువతిపై ఒక గుర్తుతెలియని దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఈ విచారకరమైన విదేశీ నయాగరా ప్రాంతంలో వెలుగుచూసింది.
Read Also : Vanaparthi Crime: అప్పుల బాధతో భార్యాపిల్లలను చంపి.. ఆ పై తాను ఉరేసుకొని ఆత్మహత్య
Unidentified man kills Indian woman in Canada
Indian student killed in canada: నాలుగేళ్లుగా కెనడాలోనే నివాసం
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలిని గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లా, బోర్సాద్ పట్టణానికి చెందిన విధి కల్పేష్‌భాయ్ మేఘానిగా గుర్తించారు. ఆమె గత నాలుగేళ్లుగా కెనడాలో నివసిస్తూ ఉన్నత చదువులు చదువుకుంటోంది. చదువుతో పాటు తన రోజువారీ ఖర్చుల నిమిత్తం విధి అక్కడ ఒక పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తోంది.
కత్తితో దాడి చేసిన దుండగుడు..
ఈ నెల 15న ఈ దారుణమైన ఘటన జరిగినట్లు కెనడా పోలీసులు ధృవీకరించారు. విధిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి అక్కడికక్కడే మరణించేలా చేశాడు. అయితే, ఈ హత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘోరంపై కేసు నమోదు చేసుకున్న కెనడా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న హంతకుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఉన్నత చదువులు చదివి, మంచి భవిష్యత్తును వెతుక్కుంటుందని ఆశించిన తమ కుమార్తె.. కెనడాలో విగతజీవిగా మారిందన్న వార్త వినడంతో విధి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి నివాసంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరోసారి తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

