Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తండ్రి సి.ఎం అయినా తనయుడు మాత్రం..!

తండ్రి సి.ఎం అయినా తనయుడు మాత్రం..!

వార్త 2 weeks ago

CM Vijay Son Jason : సినిమా వారసత్వంలో భాగంగా సాధారణంగా అయితే స్టార్ హీరో తనయుడు మరో స్టార్ అవుతాడు. అఫ్కోర్స్ అయ్యే దాకా ప్రయత్నాలు మాత్రం ఆపరు.

అలా వచ్చి స్టార్ అయిన వాళ్లు ఇప్పటికే ఉన్నారు. ఐతే అనూహ్యంగా ఒక స్టార్ డైరెక్టర్ తనయుడు హీరో కాకుండా మెగా ఫోన్ పట్టుకుని డైరెక్ట్ అవుతా అనేశాడు. మొదట అతను కామెడీ చేస్తున్నాడని అనుకున్నా ఒక తెలుగు హీరోతో సినిమా మొదలు పెట్టి పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేసే సరికి నమ్మక తప్పలేదు.

విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

దళపతిగా తిరుగులేని క్రేజ్

ఆ డైరెక్టర్ తండ్రి స్టార్ మాత్రమే కాదు ఒక సి.ఎం కూడా అయినా కూడా అతనికి ఆ సి.ఎం కమ్ స్టార్ సపోర్ట్ లేకుండానే తన సినిమా పూర్తి చేశాడట. ఇంతకీ ఆ స్టార్ హీరో, సి.ఎం తనయుడు ఎవరంటే జేసన్ సంజయ్. దళపతిగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత నాయకుడిగా మరో కొత్త శఖాన్ని ఆరంభించాడు విజయ్. అలాంటి విజయ్ తనయుడు సినిమాల్లో ఎంట్రీ అంటే ఒక రేంజ్ లో హంగామా ఉంటుంది. కానీ జేసన్ సంజయ్ తొలి సినిమా దర్శకత్వం చేస్తున్న సినిమా పూర్తయ్యే వరకు ఎవరికి పెద్దగా తెలియదు. అంతేకాదు తమిళ డెబ్యూ డైరెక్టర్ జేసన్ విజయ్ తెలుగు యువ హీరో సందీప్ కిషన్ తో సినిమా చేశాడు. సిగ్మా టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

సినిమా పూర్తై ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఐతే తనయుడి కెరీర్ కోసం తండ్రి విజయ్ ఏం చేయట్లేదా అన్న డౌట్ రాక మానదు. సి.ఎం విజయ్ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి తెలిసిందే. భార్యతో పాటు పిల్లలు కూడా విజయ్ కి దూరంగా ఉంటున్నారట. ఐతే సందీప్ కిషన్ తో సినిమా గురించి ఆ కథ ముందు విజయ్ విన్న తర్వాతనే సెట్స్ మీదకు వెళ్లిందని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా స్టార్ వారసుడి తొలి సినిమా అంటే ఉండాల్సిన హడావిడి సిగ్మా విషయంలో కనిపించట్లేదు. తండ్రి సి.ఎం అయినా కొడుకు మాత్రం ఇలా ఒక సగటు దర్శకుడిగా తన తొలి అడుగులు వేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha