Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు.. ఎనిమిది మంది మృతి

టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు.. ఎనిమిది మంది మృతి

వార్త 2 weeks ago

Uttar Pradesh Firecracker Blast: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-కౌశంబి సరిహద్దులో టపాసుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది మరణించినట్లు తెలుస్తోంది.

ఈ పేలుడు ధాటికి కేంద్రం నేలమట్టం కావడంతో శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also : AP Liquor Case: మద్యం కేసులో సిట్‌పై సుప్రీంకోర్టు ఫైర్!

 Explosion at firecracker manufacturing unit… eight dead.

Uttar Pradesh Firecracker Blast: నేలమట్టమైన భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు

పేలుడు ధాటికి ఆ తయారీ కేంద్రం పూర్తిగా నేలమట్టమవడమే కాకుండా, సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయి. భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించడంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద సమయంలో కేంద్రంలో పలువురు కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ముమ్మరంగా సహాయక చర్యలు.. ఆసుపత్రికి గాయపడినవారు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బుల్డోజర్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

తుక్కుగూడ నర్సు శిరీష హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha