Nurse Murder Case In Hyderabad : రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నర్సు వి.కె.
శిరీష (21) అనుమానాస్పద స్థితిలో దారుణంగా హత్యకు గురైన కేసును పహాడీషరీఫ్ పోలీసులు వేగంగా చేధించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన బిహార్‌కు చెందిన సైనా ఉల్లా (35) అనే వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: A Man killed brutally In Guntur : నడిరోడ్డుపై వేటకొడవళ్లతో దారుణ హత్యకు గురైన వ్యక్తి
Nurse Murder Case In Hyderabad
Nurse Murder Case In Hyderabad : ఆమె గొంతు నులిమి దారుణంగా హత్య
తోటి సిబ్బంది పండుగకు స్వగ్రామానికి వెళ్లడంతో గదిలో ఒంటరిగా ఉన్న శిరీషను గమనించిన నిందితుడు, కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించి అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు కేకలు వేస్తూ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఈ సంచలన ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ప్రజాసంఘాలు, రాజకీయనాయకులు ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఓ వ్యక్తి రాత్రి ఒంటి గంట సమయంలో అనుమానాస్పదంగా ఆస్పత్రి క్వార్టర్స్‌వైపు వెళ్లడం గమనించారు. అదే ప్రాంతంలో ఉంటున్న బిహార్‌కు చెందిన సైనా ఉల్లాను అదుపులోకి తీసుకున్నారు.

