Dailyhunt
తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ లేఖ

తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ లేఖ

వార్త 5 days ago

Tejasvi Surya Telangana Comments: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపాయి.

డీలిమిటేషన్‌పై జరిగిన చర్చలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తేజస్వి సూర్యపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి అధికారికంగా లేఖ రాశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి, రాజ్యాంగపరమైన నిబంధనలను గుర్తుచేశారు. పార్లమెంట్ లేదా అసెంబ్లీ వంటి చట్టసభల లోపల సభ్యులు మాట్లాడే అంశాలకు ‘ప్రివిలేజ్’ (సభాపరమైన రక్షణ) ఉంటుందని ఆయన వివరించారు. రాజ్యాంగంలోని అధికరణల ప్రకారం, చట్టసభల వేదికగా జరిగే చర్చలు లేదా చేసే వ్యాఖ్యలపై పోలీస్ విభాగం నేరుగా క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం లేదని డీజీపీ స్పష్టం చేశారు. ఒకవేళ ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటే, సభా నిబంధనల ప్రకారం స్పీకర్ మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Read Also: Choutkur: పెండింగ్ సమస్యలపై తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన ఉద్యోగ జేఏసీ!

 Ponnam letter to take action against Tejaswi Surya: DGP reminds of ‘protection’ of legislatures

Tejasvi Surya Telangana Comments: తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి: పొన్నం ఆగ్రహం

డీజీపీ వివరణ ఇచ్చినప్పటికీ, మంత్రి పొన్నం ప్రభాకర్ తన నిరసనను కొనసాగిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, తెలంగాణ ఉద్యమాన్ని, అమరవీరుల త్యాగాలను కించపరచడమేనని ఆయన ధ్వజమెత్తారు. “తెలంగాణ ఏర్పాటు ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. దానిని రక్తపాతంతో కూడిన దేశ విభజనతో పోల్చడం తేజస్వి సూర్య అహంకారానికి నిదర్శనం” అని పొన్నం విమర్శించారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఈ విషయంలో మౌనంగా ఉండటం సిగ్గుచేటని ఆయన ఆరోపించారు.

లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు

పోలీసుల పరిమితులు స్పష్టమవ్వడంతో, ఈ పోరాటాన్ని పార్లమెంటరీ వేదికపైనే తేల్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. తేజస్వి సూర్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని (Expunge), ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించే ఏ చర్యను వదిలిపెట్టబోమని, ఈ విషయంలో బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పెండింగ్ సమస్యలపై తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన ఉద్యోగ జేఏసీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha