Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెండింగ్ సమస్యలపై తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన ఉద్యోగ జేఏసీ!

పెండింగ్ సమస్యలపై తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన ఉద్యోగ జేఏసీ!

వార్త 2 months ago

Choutkur: చౌట్కూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో తహసీల్దార్ అనుదీప్‌కు వినతిపత్రం అందజేశారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also: Medak: రహదారి నిబంధనలు పాటిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందాం: సీఐ రేణుక రెడ్డి

 Employment JAC submits memorandum to Tahsildar on pending issues!

Choutkur: అర్హత గల వారి పిల్లలకు జీపీఓలుగా నియామకాలు

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ అమలు చేయాలని, ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఐదు డిఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్ విధానం అమలు చేయాలని ప్రధానంగా కోరారు.

అదేవిధంగా రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా మండల కార్యాలయాలు, రెవెన్యూ శాఖల్లో సేవలు అందిస్తున్న వీఆర్ఏలకు స్కేల్ పోస్టులు కల్పించాలని, అర్హత గల వారి పిల్లలకు జీపీఓలుగా నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రస్తుతం 272 మంది వీఆర్ఏలు గౌరవ వేతనంతోనే విధులు నిర్వహిస్తున్నారని, వారికి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యాలయం అటెండర్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ వరకు అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొని జేఏసీకి మద్దతు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సర్కారీ బడి - పిల్లల ఒడి: 'బడిబాట'తో గ్రామాల్లో ఉపాధ్యాయుల సందడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha