Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తేజస్వీకి అమిత్ షా క్లాస్!

తేజస్వీకి అమిత్ షా క్లాస్!

వార్త 2 months ago

తెలంగాణ విభజనను భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు అటు తెలంగాణలోనూ, ఇటు జాతీయ స్థాయిలోనూ పార్టీకి ఇబ్బందికరంగా మారతాయని గుర్తించిన అధిష్ఠానం వెంటనే అప్రమత్తమైంది.

సమాచారం ప్రకారం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా తేజస్వీ సూర్యను పిలిపించి వివరణ కోరినట్లు తెలుస్తోంది. భావోద్వేగపూరితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, ముఖ్యంగా ఒక రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న అమరుల త్యాగాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని అమిత్ షా గట్టిగా మందలించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read Also : KTR-Tejasvi Surya: తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలి.. కేటీఆర్

‘వక్రీకరణ’ పేరుతో ఆత్మరక్షణ

అమిత్ షాతో జరిగిన భేటీలో తేజస్వీ సూర్య తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అమరుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, తన మాటలను ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కావాలనే వక్రీకరించాయని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చేసిన తీరును మాత్రమే తాను విమర్శించానని, కానీ దానిని తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలుగా చిత్రీకరిస్తూ రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ విభజన ప్రక్రియలో జరిగిన లోపాలను ఎత్తిచూపడమే తన ఉద్దేశమని, అంతేకానీ తెలంగాణ అస్తిత్వాన్ని తక్కువ చేయాలన్న ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

తెలంగాణ సెంటిమెంట్.. బీజేపీ అప్రమత్తత

తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి, ఇలాంటి వివాదాలు పెద్ద అడ్డంకులుగా మారుతున్నాయి. గతంలోనూ విభజనపై పార్లమెంట్‌లో జరిగిన చర్చలు పార్టీకి ప్రతికూలంగా మారాయి. ఇప్పుడు తేజస్వీ సూర్య వ్యాఖ్యలు తెలంగాణ సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఉండటంతో, ప్రత్యర్థి పార్టీలు దీనిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమిత్ షా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రాజకీయంగా నష్టం జరగకముందే డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో భాగంగానే తేజస్వీకి ఈ ‘క్లాస్’ పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇతర నేతలు కూడా ఇలాంటి సున్నితమైన అంశాలపై ఆచి తూచి మాట్లాడాలని అధిష్ఠానం సంకేతాలు పంపినట్లయింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన ధోని..మ్యాచ్‌ ఆడతారా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha