Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కనీసం ప్రెస్‌మీట్‌కైనా అనుమతిస్తారా?.. పవన్ కల్యాణ్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కనీసం ప్రెస్‌మీట్‌కైనా అనుమతిస్తారా?.. పవన్ కల్యాణ్

వార్త 2 weeks ago

Pawan Kalyan Media Meeting: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల తన నివాసంలో ఈరోజు (జూన్ 2) సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ పోలీసులు కనీసం ఈ ప్రెస్‌మీట్‌కైనా అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. “ఏం జరుగుతుందో చూద్దాం” అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆయన ఒక ప్రత్యేక సభను నిర్వహించాలని తలపెట్టారు. అయితే, ఈ సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ స్పందిస్తూ, సభకు కాకపోయినా కనీసం తన నివాసంలో పెట్టే మీడియా సమావేశానికైనా పోలీసులు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read Also : CM Chandrababu : ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త.. రిటైర్మెంట్ వయసు పెంపు!

 Telangana Formation Day.. Will you allow at least a press meet?.. Pawan Kalyan

Pawan Kalyan Media Meeting: జనసేన పుట్టింది తెలంగాణ గడ్డపైనే..

మరోవైపు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ ఊపిరిలూదుకున్నది, ప్రాణం పోసుకున్నది ఈ గడ్డపైనేనని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ నేల నుంచే తాను వారసత్వంగా పోరాట పటిమను పుణికిపుచ్చుకున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.

“దశాబ్దాల కాలం పాటు ప్రజలు చేసిన పోరాటాలు, అమరుల త్యాగాల ప్రతిఫలమే నేటి తెలంగాణ రాష్ట్రం. పోరాటాల పుట్టినిల్లయిన ఈ గడ్డకు ఎంతో విశిష్టమైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ఫ్లోరోసిస్, రైతులు, నిరుద్యోగుల సమస్యలు అనేవి కేవలం రాజకీయం మాత్రమే కాదు.. అవి మానవీయ అంశాలు” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

సమగ్ర అభివృద్ధికి జనసేన నిబద్ధత

ప్రస్తుతం ఐటీ, వ్యవసాయ రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణలో అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు అందాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు లభించే సమగ్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ 'ఎక్స్'లో పవన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రూ. 19 కోట్ల పన్ను బకాయిలు: ఆంధ్రా పేపర్ మిల్స్ పై పవన్ ఆగ్రహం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha