Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

వార్త 2 weeks ago

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలు ఏర్పడి 12 ఏళ్లు పూర్తయిన ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు నేతలు సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) ప్రత్యేక సందేశాలను పంచుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సోదరభావంతో ప్రత్యేక ప్రకటనలు విడుదల చేశారు.

Read Also : Apspdcl Video Conference: పారిశ్రామిక విద్యుత్ సమస్యలపై రేపు వీడియో కాన్ఫరెన్స్

 Chandrababu Naidu, Pawan Kalyan extend greetings to the people on Telangana Formation Day

Telangana Formation Day: ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి అంతా ఒక్కటే: సీఎం చంద్రబాబు

తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలుగా విడిపోయి నేటికి 12 ఏళ్లు పూర్తయినప్పటికీ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటేనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు.

"ఎంతో ఘనమైన చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ విజయాలు సాధించాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలి. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు దక్కాలి. 'వికసిత్ భారత్ 2047' లక్ష్య సాధనలో మన రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేసి, దేశంలోనే కీలక పాత్ర పోషించాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టమని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. "నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం, స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు ఇదని ఆయన గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు, ముఖ్యంగా అమరవీరులకు ఆయన తన వినమ్ర నివాళులు అర్పించారు.

పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్

ఈ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది. సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha