Telangana Brand Global: ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసు కెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలని, ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.
డ్రోన్లు, కౌం టర్ డ్రోన్ సిస్టమ్స్, ఏరోస్పేస్ కాంపోనెంట్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ, ఏఐ ఇన్ డిఫెన్స్, శాటిలైట్స్ సిస్ట మ్స్ అండ్ అడ్వాన్స్డ్ కమ్యూని కేషన్స్ రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం ప్రణాళి కాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు.
Read Also: TG RTA Vahan Portal: 'వాహన్' పోర్టల్‌తో సులువైన ఫ్యాన్సీ నంబర్ల వేలం!

Telangana Brand Global: గ్లోబల్ ఏరోస్పేస్ మ్యాప్‌లో తెలంగాణ మార్క్
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ యూఎస్ నేషనల్ కాలేజ్ వార్ బృంద సభ్యులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఇక్కడి అనుకూలతలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీలు మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా వివరించారు. రాకెట్ల తయారీ నుంచి అత్యాధునిక డ్రోన్ల వరకు, యుద్ధ విమానాల విడిభాగాల నుంచి శాటిలైట్ల వరకు… అన్నింటిలోనూ “మేడిన్ తెలంగాణ మార్క్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందన్నారు. ఏరోస్పేస్: డిఫెన్స్, స్పేస్ లో తెలంగాణ ఏటా 30 శాతానికి పైగా వృద్ధిని రేటును నమోదు చేస్తోందన్నారు. అలాగే… 2024-26 మధ్య కాలంలో ఎగుమతుల్లో 103 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) నమో దయ్యిందన్నారు.
దిగ్గజ సంస్థల కార్యకలాపాలు – ఎంఎస్ఎంఈల పాత్ర
లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్, ఎయిర్ బస్, డస్సాల్ట్ ఏవియేషన్ తదితర ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్ కంపె నీలతో డీఆర్డీవో, బెల్, మిధాని, బీడీఎల్, ఆర్ సీఐ, హాల్ తదితర కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తు న్నాయన్నారు. ఇవీ కాకుండా… ప్రిసిషన్ ఇంజనీరింగ్, డ్రోన్లు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 1,500 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు ‘తెలంగాణ బ్రాండ్’ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఎఫ్ డీఏ ర్యాంకింగ్స్ ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత కాస్ట్ ఎఫెక్టివ్ ఏరోస్పేస్ సిటీగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
భవిష్యత్తు ప్రణాళికలు
కేంద్ర ప్రభుత్వం నుంచి వరుసగా ఐదుసార్లు ‘బెస్ట్ స్టేట్ ఫర్ ఏరోస్పేస్’ అవార్డును గెలుచుకుని ‘గ్లోబల్ ఏరోస్పేస్ మ్యాప్’లో తెలంగాణ ఒక శక్తిమంతమైన కేంద్రంగా మారిందన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు. అవసరమైన ఎకో సిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. టీజీ ఐపాస్ ద్వారా 15 నుంచి 30 రోజుల్లోగా అనుమతులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఈ రంగానికి అవసరమైన ‘రెడీ టూ స్కిల్ వర్క్ ఫోర్స్’ను అందిస్తున్నామన్నారు.సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, స్పేస్ టెక్నాలజీ తదితర రంగాల్లో అమెరికా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో కలిసి పని చేస్తామన్నారు.
తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, రాబోయే రోజుల్లో ఆ దిశగా అడుగులు వేస్తాం. అమెరికా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు చొరవ చూపుతాం అని స్టేట్ డిపార్ట్ మెంట్ మినిస్టర్ కౌన్సిలర్ పాల్ నరైన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కెప్టెన్ ఫ్రాంక్ ఒకటా(నేవీ), రెనో బామ్ఫోర్డ్(డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ), లెఫ్టినెంట్ కల్నల్ జాన్ కయాంగ్యాంగ్ (ఆర్మీ), రెబెక్కా కింగ్ (డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ), లెఫ్టినెంట్ కల్నల్ మైఖేల్ కూబ్(ఎయిర్ నేషనల్ గార్డ్), జోస్ సలాస్(డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏజెన్సీ), టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

