Telangana Universities: రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు కార్యానిర్వాహక మండలి(ఈసీ) సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడున్నర సంవత్సరాల తరువాత యూనివర్సిటీలకు ఈసీలను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉస్మానియా, జేఎన్టియు, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీలతోపాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెనన యూనివర్సి టీలకు ఈసీలను నియమిస్తూ విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. కాకతీయ యూనివర్సిటీకి ఇప్పటికే ఈసీని నియమించిన సంగతి తెలిసిందే.
Read Also: Municipal Corporation New Building: కైత్లాపూర్‌లో రూ.200 కోట్లతో అత్యాధునిక భవనం

Telangana Universities: పెండింగ్‌లో ఉన్న నియామకాలు
రాష్ట్రంలోని జేఎన్ఎఫ్ఎయు, సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, మహాత్మాగాందీ యూనివర్సి టీలకు ఈసీలను నియమించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం జారీ చేసిన జీవోల్లో ఈసీ సభ్యులుగా నియమితులైన వారి పదవికాలం ఎప్పటి వరకు ఉంటుందనేది చెప్పలేదు. వాస్తవంగా ఈసీ పదవి కాలం సాధారణంగా మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం జీవోలో వెల్లడించలేదు. రాష్ట్రంలో ఉస్మానియా, జెఎన్టియు, ఎసు, టియు, ఓపెన్ వర్సిటీలకు ఈసీల నియామకం పెండింగ్లో నాలుగు వర్సిటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సుమారు రెండున్నర సంవత్సరాల తరువాత యూనివర్సిటీలకు ఈసీలను నియమించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్ లర్ (వీసీ)లను నియమించి ఏడాది గడిచిన తరువాత ఇపుడు ఈసీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విశ్వవిద్యాలయాల వారీగా నియమితులైన ఈసీ సభ్యులు
- ఉస్మానియా యూనివర్సిటీ: క్లాస్-2 మెంబర్స్గా ప్రొఫెసర్ పి.ఉషారాణి, ప్రొఫెసర్ ఎం. విజ్జులత, డాక్టర్ తుమ్మలూరి శ్రీలక్ష్మి, బి.సుజాత నాయక్, డాక్టర్ జె.నీరజ, డాక్టర్ బాణాపురం మధుసూదన్ రెడ్డి, నర్రి యాదయ్య, సురం రవీందర్రెడ్డి, ప్రొఫెసర్ జి.గోపాల్ రెడ్డిలను నియమించారు.
- జేఎన్టియు: క్లాస్-2 ఈసీ సభ్యులుగా డాక్టర్ ప్రకాష్, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబు, శ్రీనివాస మూర్తిలను నియమించారు.
- డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ: క్లాస్-2 ఈసీ సభ్యులుగా సురవరం ప్రతాప రెడ్డి తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వి నిత్యానందరావు, టి సాట్ సీఈవో బి వేణుగోపాల్ రెడ్డి, బి వెంకటేశ్వరరావు, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజా రావులను నియమించారు.
- శాతవాహన యూనివర్సిటీ: క్లాస్-2 ఈసీ సభ్యులుగా వంగాల మురళీ మోహన్, కవిత ఆలేటి, ఊట్కూరి రవీందర్ రెడ్డి, శ్రీపురం ఈశ్వర్లను నియమించారు.
- తెలంగాణ యూనివర్సిటీ: క్లాస్-2 ఈసీ సభ్యులుగా చెరుకూరి రజనీకాంత్, అల్లే లావణ్య, మహ్మద్ ఘజీ, డాక్టర్ ఎస్ జయంత్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

