Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ CEO సుదర్శన్ రెడ్డికీ SIR నోటీసులు!

తెలంగాణ CEO సుదర్శన్ రెడ్డికీ SIR నోటీసులు!

వార్త 2 weeks ago

Telangana CEO : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సీ.

సుదర్శన్ రెడ్డికే భారత ఎన్నికల సంఘం (ECI) నుంచి ఎస్ఐఆర్ નોటీసు అందింది. ఓటరు రికార్డుల్లో సాంకేతిక లోపాలు, వివరాల్లో వ్యత్యాసాలు ఉండటంతో సెంట్రలైజ్డ్ డిజిటల్ సిస్టమ్ (ERONET) ద్వారా ఈ నోటీసు జనరేట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల డేటా వ్యత్యాసాలు కలిగి ఉన్న దాదాపు 93 లక్షల మంది ఓటర్ల జాబితాలో సిఇఒ పేరు కూడా ఉండటం గమనార్హం.

 Telangana SIR Process

సాంకేతిక సవరణ మాత్రమే: స్పష్టం చేసిన అధికారులు

సిఇఒ సుదర్శన్ రెడ్డికి నోటీసు రావడంపై సంబంధిత అధికారులు స్పష్టతనిచ్చారు. ఈఆర్వోనెట్ (ERONET) సిస్టమ్ ఆధార్ కార్డ్ మరియు ఓటరు గుర్తింపు కార్డ్ (EPIC) లలోని వివరాలను సరిపోల్చే సమయంలో ఇంటి పేరు (Surnames / Initials) వేర్వేరుగా ఉండటాన్ని గుర్తించింది. ఓటరు కార్డులో కేవలం ఇంటిపేరు ప్రథమాక్షరం (Initial) మాత్రమే ఉండటం, ఆధార్‌ కార్డులో పూర్తి పేరు ఉండటంతో సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఈ నోటీసును పంపింది. నిబంధనల ప్రకారం ఫారం-8 సమర్పించి వివరాలను సరిచేసుకుంటే సరిపోతుందని, ఇది కేవలం సాంకేతికపరమైన అంశమే తప్ప ఆందోళన చెందాల్సిన పెద్ద సమస్య కాదని అధికారులు స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com

కొండా సురేఖపై వేటు.. రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha