Telangana Job Cards: తెలంగాణలో గ్రామీణ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో కూలీలకు స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు కొత్తగా జాబ్‌కార్డులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.
కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా గ్రామాల్లోనే పని కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 265 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ పథకం కింద జాబ్‌కార్డులు అందించనున్నారు.
Indiramma houses last date: ఇందిరమ్మ ఇళ్ల గడువు మరో నాలుగు రోజులే

15 రోజుల్లో జాబ్‌కార్డు
18 ఏళ్లు నిండిన గ్రామీణ పౌరులు కొత్త జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం నిర్ణీత దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తును గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి. దరఖాస్తు స్వీకరించిన తర్వాత అధికారులు ప్రాథమికంగా వివరాలను పరిశీలిస్తారు. అర్హత ఉన్నట్లు నిర్ధారణ అయితే 15 రోజుల్లో జాబ్‌కార్డు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Telangana Job Cards: వలసలు తగ్గించడమే లక్ష్యం
కరువు పరిస్థితుల కారణంగా గ్రామాల్లో పనులు తగ్గి కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా కూలీలకు ఆదాయం అందించడంతో పాటు వలసలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. కరువు ప్రభావిత 265 మండలాల్లో అవసరమైన మేరకు ఉపాధి పనులను అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత శాఖలు చర్యలు చేపట్టనున్నాయి.

