Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల!

తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల!

వార్త 1 week ago

TG LAWCET 2026: తెలంగాణ రాష్ట్రంలో లా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కీలక అప్‌డేట్ అందించింది. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల కోసం నిర్వహించిన 'తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్' (TG LAWCET-2026) తో పాటు, ఎల్‌ఎల్‌ఎమ్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన 'తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్' (TG PGLCET-2026) ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు అధికారికంగా విడుదల చేశారు.

కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను జూన్ 26న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Read Also : Telangana Voter List Revision: నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం!.. మీ ఓటు వివరాలు సరిచూసుకోండి

 Telangana Lawset, PGLCET Counseling Schedule Released!

రెండు వేర్వేరు కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ వేర్వేరు తేదీల్లో జరగనుంది. ఆ పూర్తి వివరాలు క్రింది పట్టికల్లో పరిశీలించవచ్చు.

TG LAWCET 2026: టీజీ లాసెట్‌ (TG LAWCET-2026) కౌన్సెలింగ్ తేదీలు

కౌన్సెలింగ్ ప్రక్రియతేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (నమోదు)జూలై 5 నుంచి జూలై 10 వరకు
వెబ్ ఆప్షన్ల నమోదుజూలై 16 నుంచి జూలై 19 వరకు
సీట్ల కేటాయింపు (అలాట్‌మెంట్)జూలై 24
కళాశాలల్లో రిపోర్టింగ్జూలై 25 నుంచి జూలై 28 వరకు

టీజీ పీజీఎల్‌సెట్ (TG PGLCET-2026) కౌన్సెలింగ్ తేదీలు

కౌన్సెలింగ్ ప్రక్రియతేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (నమోదు)జూలై 27 నుంచి జూలై 31 వరకు
వెబ్ ఆప్షన్ల నమోదుఆగస్టు 1, ఆగస్టు 2
సీట్ల కేటాయింపు (అలాట్‌మెంట్)ఆగస్టు 5
కళాశాలల్లో రిపోర్టింగ్ఆగస్టు 5 నుంచి ఆగస్టు 8 వరకు

న్యాయ విద్యలో ప్రవేశాలు కోరుకునే అర్హులైన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలను జాగ్రత్తగా గమనించి, నిర్ణీత గడువులోగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ,ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని అధికారిక వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే: ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు తాత్కాలిక ఊరట

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha