Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ లో 'సర్' గడువు పొడిగింపు

తెలంగాణ లో 'సర్' గడువు పొడిగింపు

వార్త 3 weeks ago

SIR : తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (EC) కీలక నిర్ణయం తీసుకుంది. 'సర్' కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ అభ్యంతరాలు, దావాలు (క్లెయిమ్‌లు) సమర్పించేందుకు విధించిన మునుపటి గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవానికి ఈ సవరణ ప్రక్రియ అభ్యంతరాల స్వీకరణ గడువు ఈ నెల 16తో ముగియాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో గరిష్ఠ సంఖ్యలో అర్హులైన పౌరులకు ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో, దరఖాస్తుల పరిశీలనకు మరికొంత సమయం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేకంగా లేఖలు రాశారు. ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ఈసీ, ఓటర్ల సవరణ గడువును విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది.

నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా విడుదల

ఈ గడువు పొడిగింపు నిర్ణయం వల్ల కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలనుకునే వారితో పాటు తమ వివరాల్లో మార్పులు, చేర్పులు మరియు సవరణలు చేసుకోవాలనుకునే వారికి మరో అవకాశంగా మారనుంది. పొడిగించిన గడువు ముగిసిన అనంతరం అధికారులు నమోదు చేసుకున్న క్లెయిమ్‌లు, అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9వ తేదీన అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అర్హులైన ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కు నమోదు మరియు సవరణలు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha