Congress Party : ఖమ్మంలో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఎన్నికల వేళ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ఇళ్లకు 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక దాన్ని ఐదు లక్షల రూపాయలకు తగ్గించి పేదలను నిలువునా వంచించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ మార్కు పాలన కేవలం కూలగొట్టడాలకే పరిమితమైందని, పేదలకు కొత్త ఇళ్లు నిర్మించడం ఆ పార్టీకి చేతకాదని ఎద్దేవా చేశారు. పవిత్రమైన దేవుడిపై ఒట్టు వేసి మరి రైతుబంధు (రైతు భరోసా) నిధులను ఎగ్గొట్టారని, అన్నదాతలను రోడ్డున పడేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Read Also : జొన్నల కొనుగోలు కేంద్రంలో లారీల కొరత.. రైతుల రాస్తారోకో

రాష్ట్రంలో తిరోగమన పాలన.. పాత పరిస్థితులపై ఆందోళన
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతిని కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్ వేసి వెనక్కి నెట్టేసిందని కేటీఆర్ విమర్శించారు. నాడు తాగునీరు, సాగునీరు, నిరంతర విద్యుత్‌తో కళకళలాడిన తెలంగాణలో.. నేడు మళ్లీ కరెంట్ కోతలు, సాగునీటి ఎద్దడి వంటి వెనుకటి పాత రోజులు (తిరోగమన పరిస్థితులు) కళ్లముందు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రం మళ్లీ సంక్షోభంలోకి వెళ్తోందని హెచ్చరించారు. బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ప్రజల పక్షాన నిలబడి బీఆర్ఎస్ శ్రేణులు నిరంతరం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

