Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ మీదుగా రూ. 7,000 కోట్లతో ఎల్పీజీ పైప్‌లైన్లు..!!

తెలంగాణ మీదుగా రూ. 7,000 కోట్లతో ఎల్పీజీ పైప్‌లైన్లు..!!

వార్త 1 month ago

LPG Pipelines : దేశంలో ఇంధన భద్రతను పటిష్టం చేయడంతో పాటు గృహావసరాలకు సురక్షితంగా LPG గ్యాస్ సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (PNGRB) దేశవ్యాప్తంగా 1,800 కిలోమీటర్ల మేర 3 వ్యూహాత్మక LPG పైప్‌లైన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 7,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ రంగ దిగ్గజం GAIL (India) ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల మీదుగా ఈ నెట్‌వర్క్ విస్తరించనుంది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం దేశంలో ఉన్న 7,700 కిలోమీటర్ల LPG పైప్‌లైన్ వ్యవస్థ ఏకంగా 9,500 కిలోమీటర్లకు పెరగనుంది.

తెలంగాణకు ప్రాధాన్యత - చర్లపల్లి టూ నాగ్‌పూర్ మార్గం

ఈ బృహత్తర ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్రానుకి అత్యంత కీలకమైన స్థానం లభించింది. హైదరాబాదు సమీపంలోని చర్లపల్లి నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు ప్రత్యేకంగా ఓ ప్రధాన LPG పైప్‌లైన్ మార్గాన్ని నిర్మించనున్నారు. రోడ్డు మార్గంలో ట్యాంకర్ల ద్వారా గ్యాస్ రవాణా చేయడం వల్ల కలిగే ప్రమాదాలు, ఆలస్యం, మరియు అధిక రవాణా ఖర్చులను ఈ భూగర్భ పైప్‌లైన్లు గణనీయంగా తగ్గిస్తాయి. తెలంగాణలోని బాట్లింగ్ ప్లాంట్లకు నిరంతరం, సురక్షితంగా ఇంధన సరఫరా జరగడం వల్ల భవిష్యత్తులో గ్యాస్ కొరత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా, స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధి, రవాణా వ్యవస్థల బలోపేతానికి ఈ ప్రాజెక్ట్ ఎంతో దోహదపడనుంది.

తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ సెంటర్.. సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ ఆహ్వానం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha