Telangana MeeSeva Charges Hike: తెలంగాణ రాష్ట్రంలో మీసేవ (MeeSeva) సేవల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులకు వివిధ ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ సేవలను అందించే మీసేవ కేంద్రాల్లో సర్వీస్ ఛార్జీలను ప్రభుత్వం గణనీయంగా పెంచింది.
పెరిగిన ఈ కొత్త ధరలు నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.
Read Also:Telangana Job Calendar: జాబ్ క్యాలెండర్‌పై కవిత నిలదీత.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?
ఏ కేటగిరీకి ఎంత?
మీసేవలో అందించే సేవలను ప్రభుత్వం ప్రధానంగా రెండు కేటగిరీలుగా విభజించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- ‘ఏ’ కేటగిరీ సర్వీసులు: గతంలో ఈ సేవలకు కనీస ఛార్జీ రూ. 35 ఉండగా, ఇప్పుడు దానిని రూ. 62కు పెంచారు. (ఇందులో అడంగల్, పహాణీ వంటి తక్షణమే ఇచ్చే సేవలు ఉంటాయి).
- ‘బి’ కేటగిరీ సర్వీసులు: దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయ్యే సేవల ఛార్జీని రూ. 80గా నిర్ణయించారు. (ఉదాహరణకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు).
Telangana MeeSeva charges hike
Telangana MeeSeva Charges Hike: పెరుగుదలకు కారణమేంటి?
గత కొన్నేళ్లుగా నిర్వహణ ఖర్చులు పెరగడం, మీసేవ నిర్వాహకుల నుంచి వస్తున్న వినతుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఒక్కసారిగా దాదాపు రెట్టింపు స్థాయిలో ఛార్జీలు పెరగడంపై సామాన్య ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు రూ. 35తో అయిపోయే పనికి ఇప్పుడు రూ. 62 చెల్లించాల్సి రావడమే కాకుండా, అదనంగా అప్లికేషన్ ఫీజులు కూడా తోడవ్వడంతో జనం జేబులకు చిల్లు పడుతోంది.
ప్రజలపై ప్రభావం
విద్యార్థులు, రైతులు మరియు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే పేద ప్రజలపై ఈ భారం ఎక్కువగా పడనుంది. ముఖ్యంగా సర్టిఫికెట్ల కోసం మీసేవపైనే ఆధారపడే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది అదనపు భారంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

