Dailyhunt
తెలంగాణలో పారాక్వాట్ గడ్డిమందుపై నిషేధం

తెలంగాణలో పారాక్వాట్ గడ్డిమందుపై నిషేధం

వార్త 2 weeks ago

Paraquat Ban Telangana: రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందు వాడకం వల్ల ప్రాణహాని కలిగే అవకాశం ఉందన్న నివేదికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పారాక్వాట్‌ను శాశ్వతంగా నిషేధించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది.ష్ట్రవ్యాప్తంగా పారాక్వాట్ అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా విక్రయాలు జరిపినా లేదా నిల్వ ఉంచినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.

Read Also:Telangana Job Calendar: జాబ్ క్యాలెండర్‌పై కవిత నిలదీత.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?

 Paraquat Ban in Telangana

పారాక్వాట్ ఎందుకు ప్రమాదకరం?

పారాక్వాట్ అనేది అత్యంత శక్తివంతమైన గడ్డిమందు. దీనిని పొరపాటున తీసుకోవడం వల్ల లేదా చర్మంపై పడటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ విషప్రయోగం జరిగినప్పుడు సరైన విరుగుడు లేకపోవడం వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే గత కొంతకాలంగా సామాజిక కార్యకర్తలు, వైద్యులు దీనిని నిషేధించాలని కోరుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

డ్రగ్స్ నిర్మూలనకు 'ఈగల్ వెబ్సైట్‌' విశేష కృషి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha